AP: ప్రజలకు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక..!
అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఔట్లను అధికారులు తొలగించారు. అనధికార లేఔట్లను అమ్మడం చట్టరీత్యా నేరమని అలా చేసిన వారికి శిక్ష ఉంటుందని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.
అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఔట్లను అధికారులు తొలగించారు. అనధికార లేఔట్లను అమ్మడం చట్టరీత్యా నేరమని అలా చేసిన వారికి శిక్ష ఉంటుందని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఎప్పుడు తాను ద్రోహం చేయలేదని..పార్టీనే తనకు ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరాలన్నది ఆప్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని సిద్ధారెడ్డి వెల్లడించారు.
AP: జగన్కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఆ పార్టీ ఎమ్మెల్సీ జకీయా ఖానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ని కలిసి.. సన్మానించారు. దీంతో ఆమె పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరందుకుంది.
అనంతపురం జిల్లా పెనకచర్ల గ్రామంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు అరెస్టు అయ్యాడు. ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. గాయపడిన అక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
AP: ఓటమి తరువాత కూడా కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు మంత్రి సత్యకుమార్. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నిస్తే నాలుగు ఏళ్ల కిందట ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ తనను ట్విట్టర్ (X)లో బ్లాక్ చేశారని చెప్పారు. జగన్ ఓటమిని కేటీఆర్ తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
అనంతపురం జిల్లా మెచ్చిరి గ్రామ సమీపంలో టీడీపీ నేత గొల్ల ఆదెప్ప దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ ప్రత్యర్థులు వేట కొడవళ్ళు, కత్తులతో ఆదెప్పను దారుణంగా పొడిచి హత్య చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు గల కారణాలుగా పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
సత్యసాయి జిల్లా కొత్తకోటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఘటనపై మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్ బుక్ పేరిట టీడీపీ గ్రామాల్లోకి విష సంస్కృతిని తీసుకొచ్చిందని మండిపడ్డారు.
దక్షిణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి వాహనదారులు , పాదచారులు తిరగడానికి పాట్లు డుతున్నారు.