AP: అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు.. చివరికి..!

అనంతపురం జిల్లా పెనకచర్ల గ్రామంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు అరెస్టు అయ్యాడు. ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. గాయపడిన అక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

New Update
AP: అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు.. చివరికి..!

Ananthapur: ఈ మధ్య కాలంలో ఆస్తి కోసం సొంత వాళ్లనే చంపుకుంటున్న ఘటనలు ఎక్కువ అయ్యాయి. తాజాగా, ఇంటి స్థలం విషయంలో అక్కపై గొడ్డలితో దాడి చేశాడు ఓ తమ్ముడు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి స్థలం విషయంలో అక్క తమ్ముడి మధ్య గొడవ మొదలైంది.

Also Read: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..

తీవ్ర ఆగ్రహానికి లోనైన తమ్ముడు జిలాని అక్క మహబూబిపై దారుణంగా గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు జిలానిని అరెస్ట్ చేశారు. దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు