కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఎమ్మిగనూరులో రోడ్డు మీద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి చెప్పుల దండ కట్టి వెళ్లాడు. ఉద్దేశపూర్వకంగానే చెప్పుల దండ వేశారని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ALSO READ : తెలంగాణ తల్లి విగ్రహ మార్పులపై హైకోర్టుకు జూలూరి గౌరీ శంకర్
వైఎస్ఆర్ విగ్రహానికి చెప్పుల దండ కట్టిన వ్యక్తిని ఎమ్మిగనూరు పోలీసులు పట్టుకొని విడిచిపెట్టారు. ఈ విషయంపై పోలీసులను వైసిపి నాయకులు నిలదీశారు. వ్యక్తికి మతిస్థిమితం లేదని, అందుకే అతన్ని వదలేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. వైసీపీ నాయకులు మాత్రం పోలీసుల మాటలు వినడం లేదు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.