Ambati Rambabu: పుష్ప2 రేంజ్‌లో రేవంత్‌కు ‘సోఫా’ చేరాల్సిందే: అంబటి సెటైర్

సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీపై ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. పుష్ప-2 సినిమాలోని ‘సోఫా’ అంశాన్ని తెరమీదకి తీసుకొస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘‘పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు.

New Update
cm revanth and ambati

cm revanth and ambati Photograph: (cm revanth and ambati)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - టాలీవుడ్ సినీ ప్రముఖుల మధ్య ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశం వాడీ వేడీగా సాగింది. ఇందులో రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అనంతరం సినీ ప్రముఖులు సైతం తమ అభ్యర్థనలను రేవంత్ ముందు ఉంచారు. ఇలా ఇరువురి మధ్య భేటీ తాజాగా ముగిసింది. 

ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

అంబటి చురకలు

అయితే సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. పుష్ప-2 సినిమాలోని ‘సోఫా’ అంశాన్ని తెరమీదకి తీసుకొస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు. ‘‘పూర్తి పరిష్కారానికి ‘సోఫా’ చేరాల్సిందే’’ అంటూ ట్వీట్ చేశారు. మరి పుష్ప-2లో ‘సోఫా’ మర్మమేంటో సినిమా చూసినవారందరికీ తెలిసిందే. 

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

ఇప్పుడు పుష్ప 2 సినిమాలోని సోఫా అంశానికి వస్తే.. ఈ మూవీలో పుష్పరాజ్‌కి తన భార్య శ్రీవల్లి ఒక కోరిక తీర్చమంటుంది. సీఎంతో ఫొటో దిగి రమ్మంటుంది. దీంతో పుష్పరాజ్, మంత్రితో కలిసి సీఎం వద్దకు వెళ్తారు. కానీ సీఎం ఫొటోకి దిగడానికి ఇష్టపడడు. పుష్పరాజ్‌కు కోపం వచ్చి సీఎంనే మార్చేయాలనుకుంటాడు. దీంతో మంత్రి (రావురమేష్)ని సీఎం చేయాలనుకుంటాడు. 

అదే విషయం మంత్రి (రావు రమేష్) కి చెబితే తన వద్ద అంత డబ్బులేదంటాడు. ఎలక్షన్లకు సరిపడా డబ్బు తాను చేకూరుస్తానని పుష్పరాజ్ మాట ఇస్తాడు. ఏకంగా రూ.500 కోట్లు ఇచ్చేందుకు పుష్పరాజ్ ఓకే చెప్తాడు. దీంతో ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు పంపిస్తాడు. ఏకంగా ‘సోఫా’లలో డబ్బులు పెట్టి లారీలు, ఆటోలు, హెలీకాప్టర్ ద్వారా ఒక్కో ఎమ్మెల్యేకు డబ్బులు పంపిస్తాడు. ఇప్పుడు అదే అంశాన్ని అంబటి రాంబాబు లేవనెత్తుతూ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి పుష్ప 2 మూవీలో మాదిరిగానే రేవంత్‌కు కూడా డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతాయి అనే విధంగా ఆయన ట్వీట్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు