BIGG BOSS TELUGU: రచ్చ రచ్చే.. ప్రభాస్ హీరోయిన్ తో పాటు బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!

తెలుగు బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది.  ఓవైపు  'అగ్నిపరీక్ష' ద్వారా కామానర్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు సెలెబ్రెటీ కంటెస్టెంట్ ఎవరు?

New Update
Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9

BIGG BOSS TELUGU: తెలుగు బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది.  ఓవైపు  'అగ్నిపరీక్ష' ద్వారా కామానర్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు సెలెబ్రెటీ కంటెస్టెంట్ ఎవరు? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్  కి  సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి జనాలకు బాగా తెలిసిన మొహాలతో షోను నిర్వహించే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇందులో  సినిమా హీరోయిన్స్, బుల్లితెర నటులు, కొరియోగ్రాఫర్స్, పొలిటికల్ నేపథ్యం ఉన్నవారు  ఉండబోతున్నారని టాక్. ఈ లిస్ట్ ప్రభాస్ హీరోయిన్ నిక్కీ సంజనా గల్రాని, ‘నరసింహ నాయుడు’ మూవీ  ‘లక్స్ పాప’ సాంగ్ ఫేమ్ ఆశా షైనీ వంటి ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న మరొకొందరి పేర్లు ఇక్కడ తెలుసుకుందాం.. 

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ 

'నాపేరు మీనాక్షి', 'కంటే కూతురునే కనాలి' వంటి సీరియల్స్ తో పాపులరైన నవ్యస్వామి, గుప్పెడంత మనసు సీరియల్ తో అమ్మాయిలను, బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేసిన ముఖేష్ గౌడ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలతో సంచలనం రేపిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రిష్టి వర్మ, కోయిలమ్మ సీరియల్ ఫేమ్, అమరదీప్ వైఫ్ తేజస్విని గౌడ, బ్రహ్మముడి ఫేమ్ కావ్య, ‘రాను బొంబాయికి రాను' పాటతో యూట్యూబ్ ను షేక్ చేసిన రాము రాథోడ్, జబర్దస్త్ కమెడియన్ ఇమ్యానుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి సీజన్ 9 కంటెస్టెంట్స్ గా సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఈ పేర్లన్నీ ఊహాగానాలు మాత్రమే!

Also Read: SSMB29 Rajamouli: కెన్యా మంత్రిని కలిసిన రాజమౌళి.. 120 దేశాల్లో! SSMB29 కోసం భారీ ప్లానింగ్

Advertisment
తాజా కథనాలు