Prakash Raj : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. 'గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం' అని ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 26 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Prakash Raj: డిప్యూటీ సీఎం పవన్, ప్రకాష్ రాజ్ మధ్య లడ్డూ వివాదం ముదురుతోంది. తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్‌రాజ్ ట్వీట్‌కు పవన్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌కు నటుడు ప్రకాష్‌రాజ్ రీకౌంటర్ ఇస్తున్నారు. గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం అని ట్వీట్ చేశారు. నిన్న చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం..ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్? #justasking — Prakash Raj (@prakashraaj) September 26, 2024 హీరో కార్తీకి మద్దతుగా... నటుడు ప్రకాష్ రాజ్.. కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పడం పై సంచలన పోస్ట్ పెట్టారు. ''చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో!'' జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ఉద్దేశిస్తూ వెటకారంగా ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''జరిగింది తెలుసుకుని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ కు సూచించారు. దీనిపై మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. లడ్డూ వివాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు అర్థం కాకపోతే మరొకసారి తన ట్వీట్ చదువుకోండి అంటూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్... #justasking — Prakash Raj (@prakashraaj) September 25, 2024 Also Read : జగన్ తిరుమల పర్యటనపై ఏపీలో రచ్చ #pawan-kalyan #tollywood #prakash-raj #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి