Andhra Pradesh: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. కీ పాయింట్స్‌ వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.2,86,389 కోట్లుగా అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. రూ.2,20,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు.

Andhra Pradesh: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌.. కీ పాయింట్స్‌ వివరాలు
New Update

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో.. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ మొత్తం రూ.2,86,389 కోట్లుగా అంచనా వేశారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ ఆదాయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. అలాగే రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GDSP)లో 3.51 శాతం ద్రవ్యలోటు.. 1.56 శాతం రెవెన్యూలోటు ఉంటుందని చెప్పారు.

రూ.2,05,352 కోట్ల రెవెన్యూ రాబడి

ఆర్థిక ఏడాదికి మొత్తం బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించినా కూడా ఏప్రిల్ నుంచి జులై వరకు అంటే మూడు నెలల వరకు మాత్రమే ఆమోదం తీసుకుంటారు. ఎన్నికలు పూర్తయ్యాక.. కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పూరిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. అయితే ప్రభుత్వం 2,05,352 కోట్ల రెవెన్యూ రాబడిని బడ్జెట్‌లో అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల నుంచి రూ. 1,09,538 కోట్లు వస్తుందని అంచానా వేసింది. ఇక రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానాల్ని అవలంబించినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Also Read: ప్లాస్టిక్‌ నోట్ల గురించి పార్లమెంట్‌ లో చర్చ..కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

విద్యార్థులకు అండగా

' 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు కల్పించాం. రెవెన్యూ డివిజన్లు 55 నుంచి 78కి పెంచారం. ప్రతీ జిల్లాలో దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 1000 పాఠశాలల్లో సీబీఎస్‌సీ సిలబస్ చేర్చాం. రూ.3367 కోట్లతో జగన్న విద్యా కానుక, 47 లక్షల మందికి విద్యార్థులకు విద్యా కానుక అందించాం. 99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలు అందించాం. విద్యార్థులకు ఉచితంగా 9,52,925 ట్యాబ్స్ అందించాం. డ్రాప్‌ అవుట్‌ శాతం 20.37 నుంచి 6.62 శాతానికి తగ్గించాం.

వ్యవయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్

విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ధి చేకూర్చాం. ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం చేశాం. బోధనా ఆస్పత్రులకు 16,852 కోట్లు ఖర్చు చేశాం. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్‌ అందిస్తున్నాం. వ్యవసాయ రంగం విద్యుత్‌ కోసం రూ.3,7374 కోట్ల సబ్సిడీ అందించాం.

ఐదేళ్లలో 93 వేల ఉద్యోగాలు 

ఐదేళ్లలో నాలుగు లక్షల 93వేల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 21,3662 శాశ్వత నియామకాలు. 10వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరణ చేశాం. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. డీఎస్సీ ద్వారా 6100 ఉపాధ్యాయ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాం. 2019-23 మధ్య ప్రజా పంపిణీ కోసం రూ.29628 కోట్లు ఖర్చు చేశాం. గత ఐదు సంవత్సరాల్లో రూ.4.23 లక్షల కోట్లు ప్రజలకు చేరవేశాం. డీబీటీ ద్వారా రూ.2.53లక్షల కోట్లు అలాగే నాన్‌ డీబీజీ ద్వారా రూ.1.68 కోట్లు ప్రజలకు నేరుగా అందించాం'. అని మంత్రి బుగ్గన ప్రసంగించారు.

Also read: ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. జగన్, చంద్రబాబులకు షర్మిలా లేఖ

#ap-news #ap-budget #andhra-pradesh-budget #vote-on-account-budget
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe