YCP vs TDP: ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ.. ఈసీకి వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులు! ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య కొనసాగుతున్న వార్ ఢిల్లీకి చేరనుంది. బోగస్ ఓట్ల వ్యవహారంపై పరస్పరం ఫిర్యాదులు చేసేందుకు రెండు పార్టీలు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)ని కలవనున్నాయి. రెండు పార్టీల నేతలకు గంట వ్యవధిలో సీఈసీ అపాయింట్‌మెంట్‌లు ఇచ్చింది. కనీసం 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని..ఇది చంద్రబాబు హయాంలోనే జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని టీడీపీ వాదిస్తోంది By Trinath 28 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి YSRCP TDP to complain to ECI on bogus votes issue: ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం కాక రేపుతోంది. ఈ పంచాయతీ అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీకి చేరింది. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఫిర్యాదులు చేయనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల 30నిమిషాలకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తుండగా.. సాయంత్రం 4 గంటల 30నిమిషాలకు సీఈసీతో వైసీపీ నేతలు భేటీ కానున్నారు. ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు హయాంలో దొంగ ఓట్లను చేర్చారని వైసీపీ వాదిస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వమే ఓటర్లను తొలగిస్తుందంటూ టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఏపీలో కొన్ని రోజులుగా దొంగ ఓట్ల వ్యవహారంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. దీంతో ఈ లొల్లిని నేరుగా సీఈసీతోనే తేల్చుకోవాలని ఇరు పార్టీలు భావించాయి. భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తుండగా, అధికార పార్టీకి పలువురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోగస్ ఓట్లను చేర్చడం, వలస వచ్చిన ఓటర్లు, మద్దతుదారుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం లాంటి ఆరోపణలపై రెండు పార్టీలు కంప్లైంట్ ఇవ్వనున్నాయి. అక్రమంగా ఓట్లు తొలగించారంటూ ఇప్పటికే రాష్ట్ర అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈసీ మార్గదర్శకాలను వైసీపీ సరిగ్గా పాటించడం లేదంటూ ఇటీవల టీడీపీకి చెందిన ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేశారు. ఇక్కడ పని జరగడంలేదని.. హస్తినకు బాబు: రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ, బోగస్ ఓట్ల నమోదు, టీడీపీ సానుభూతిపరుల పేర్ల తొలగింపు, ఒకే కుటుంబానికి చెందిన వారికి వేర్వేరు పోలింగ్ బూత్‌ల కేటాయింపు లాంటి అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ స్మారకార్థం చేసిన వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి వెళ్లారు.ఈ ప్రొగ్రమ్ తర్వాత.. మధ్యాహ్నం సీఈసీని చంద్రబాబు కలుస్తారు. టీడీపీ మద్దతుదారుల పేర్ల తొలగింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌తో ఫిర్యాదు చేస్తారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు తమ ఫిర్యాదులపై స్పందించడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. గ్రామ/వార్డు వాలంటీర్ల సహాయంతో అధికార పార్టీ నాయకులు వైసీపీ అనుకూల, వ్యతిరేక ఓటర్లపై సమాచారం రాబడుతున్నారని టీడీపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా, కనీసం 60 లక్షల బోగస్, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని, అవన్నీ టీడీపీకి చెందినవేనని వైసీపీ ఆరోపించింది. ALSO READ: అందరిచూపు ఎన్టీఆర్ నాణెం వైపే.. విడుదల చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము! #ycp #tdp #votes #cec #eci #fraud-votes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి