చంద్రబాబుకు సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదా?.. మంత్రి అంబటి హాట్ కామెంట్స్.. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. లోకకల్యాణం కోసమే టీడీపీ-జనసేన పొత్తు అని అనడాన్ని తప్పుపట్టారు. జైలుకి వెళ్లొచ్చాక చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందన్నారు. By Shiva.K 16 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Andhra Pradesh: టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) సంచలన కామెంట్స్ చేశారు. లోకకళ్యాణం కోసమే టీడీపీ(TDP), జనసేన(Janasena) కలిసి పోటీ చేస్తున్నాయని చంద్రబాబు అంటున్నారని, జైలుకి వెళ్లొచ్చాక ఆయనకు మతిస్థిమితం పోయినట్లుందని ఎద్దేవా చేశారు. 2014-19 మధ్య చేసినట్టుగానే అద్భుతంగా పని చేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదు? అని ప్రశ్నించారు మంత్రి. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి అంబడి రాంబాబు.. పవన్ కళ్యాణ్ ని ఎందుకు వెంట పెట్టుకుని రావాలనుకుంటున్నారు? అని చంద్రబాబును ప్రశ్నించారు. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే తమ టార్గెట్ అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ, జనసేనని తుక్కుతుక్కుగా ఓడించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. 60 శాతం పైగా ప్రజలు మళ్ళీ జగనే కావాలంటున్నారని పేర్కొన్నారు మంత్రి అంబటి. తమ మార్పుల గురించి అడుగుతున్నారు సరే.. మరి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేసిందెక్కడ? అని ప్రశ్నించారు మంత్రి. చంద్రగిరిలో చిత్తుగా ఓడిపోయాక కుప్పం ఎందుకు పారిపోయారని నిలదీశారు. Also Read: వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. 'మీ చిత్తూరు జిల్లాని కాదని లోకేష్ ని మంగళగిరిలో ఎందుకు పోటీ చేయించారు? బాలకృష్ణ స్వస్థలం గుడివాడ కదా? మరి హిందూపురం ఎందుకు వెళ్లారు? పురంధేశ్వరి ఎందుకు సీట్లు మారుతున్నారు? వచ్చే ఎన్నికల తర్వాత చంద్రగిరి, మంగళగిరి వదిలి అబ్బాకొడుకులు శంకరగిరి మాణ్యాలకు పోవాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గౌరవం కల్పించిందే జగన్. మా పరిపాలన చూశాక ఇక జీవితంలో అధికారం రాదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. యువగళం ద్వారా లోకేష్ ఏమైనా నాయకుడయ్యాడా? రాజకీయంగా ఏమైనా ఎదగాడా? యువగళం అట్టర్ ప్లాప్ అయింది. లోకేష్ రాజకీయంగా అంగుళం కూడా ఎదగలేదు. సున్నా సున్నా కలిస్తే పెద్దసున్నా అవుతుంది.' అంటూ చంద్రబాబు, లోకేష్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మా పార్టీలో ఇంఛార్జిల మార్పులు చేస్తే... @ncbn కు వచ్చిన బాధ ఏమిటో... గతంలో తాను ఎంతమంది అభ్యర్థుల్ని మార్చారో బాబు మరిచిపోయారు. రాబోయే ఎన్నికల తరువాత చంద్రబాబు అండ్ కో కు శంకరగిరి మాన్యాలే గతి. -మంత్రి అంబటి రాంబాబు #YSRCP #EndOfTDP… pic.twitter.com/U3bfHPCWIf — YSR Congress Party (@YSRCParty) December 16, 2023 ఇక జనసేనతో పొత్తుపైనా హాట్ కామెంట్స్ చేశారు మంత్ర అంబటి. 'పవన్ కళ్యాణ్ కి ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి? గతంలో మీరు కలిసి పోటీ చేసి ఎందుకు విడిపోయారు? మీది కలహాల కాపురం అని తేలి పోయింది. పదేళ్లపాటు టీడీపీతో పొత్తు కాంట్రాక్టు మాట్లాడుకున్నారేమో?. చంద్రబాబు, పవన్, లోకేష్ అసలు అడ్రస్ ఎక్కడ ఉంటారు? సీఎం అయితేనే చంద్రబాబు అసెంబ్లీకి వస్తారా?నాగబాబు ఫ్యామిలీ డబుల్ ఓటు నమోదు చేసుకోవటం వారికి నైతికత లేదని అర్థం అయింది. పోలవరం ఈ స్థితికి రావటానికి కారణం చంద్రబాబే. ఎల్లో మీడియాలో ఎంతగొప్పగా రాసుకున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. నాకు సీటు ఇవ్వకపోయినా పక్కచూపులు చూడను. జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తా.' అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. Also Read: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం.. #andhra-pradesh #tdp #janasena #minister-ambati-rambabu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి