CM YS Jagan Tour in Vijayawada: రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హయత్ ప్లేస్ హోటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. పర్యాటక రంగంలో అంత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 'హయల్ ప్లేస్' విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. By E. Chinni 17 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి CM YS Jagan Tour in Vijayawada: ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హయత్ ప్లేస్ హోటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. పర్యాటక రంగంలో అంత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 'హయల్ ప్లేస్' విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కాగా విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ ఫోర్త్ స్టార్ హోటల్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందని హోటల్ హయత్ ప్లేస్ చైర్మన్ రామిశెట్టి వీరాస్వామి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో హయత్ ప్లేస్ స్టార్ హోటల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో మూడు హయత్ ప్లేస్ గ్రూప్ హోటల్ లను దిగ్విజయంగా నిర్వహిస్తూ పర్యాటకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. విభజన అనంతరం ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్ లో తొలి సారిగా విజయవాడ నగరంలో హయత్ ప్లేస్ హోటల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు హయత్ ప్లేస్ ను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, హోటల్స్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారని రామిశెట్టి వీరాస్వామి తెలిపారు. #andhra-pradesh #vijayawada #cm-ys-jagan #andhra-pradesh-cm-ys-jagan #tomorrow మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి