తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడివి?
జగన్, షర్మిల పాలిటిక్స్ మధ్య తల్లి విజయమ్మ నలిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక ఆమె అమెరికా వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయమ్మ అమెరికాకు వెళ్లడంపై ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
విశ్వాసనీయతకు మారుపేరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని అన్నారు సీఎం జగన్. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు వివరాలు వెల్లడించారు సీఎం.
సీఎం జగన్ కు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. వై ఏపీ నీడ్స్ జగన్.. దేనికోసం..? అంటూ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాన్ని మీ మూర్ఖుపు పాలనతో అధోగతిపాలు చేసి.. అగమ్యగోచరంలోకి నెట్టేసినందుకా.. ఈ రాష్ట్రానికి మీరు అవసరం అంటూ దుయ్యబట్టారు.
జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం, రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు.