Independence Day 2023: ఏపీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. జెండా ఎగరేసిన ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తాన్నమన్నారు. By E. Chinni 15 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆగష్టు 15 వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మన జెండా.. 140 కోట్ల మంది భారతీయుల గుండె. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి గుర్తు. మన పూర్వీకుల త్యాగానికి గుర్తు. ఈ జెండా నిరంతరం మనకు స్ఫూర్తిని ఇస్తోందన్నారు జగన్. ఈ జెండాకి సెల్యూట్ చేస్తున్నా అన్నారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో.. 76 ఏళ్లలో ఎంతో ప్రగతి కనిపించిందన్నారు. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్నారు. గ్రామాల అభివృద్ధికి 50 నెలల్లో ఏన్నో చేశామన్నారు. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తామన్నారు. తమ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామని, ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప మార్పు తీసుకువచ్చినట్టు సీఎం పేర్కొన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని, రాష్ట్రంలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలను అందించామని వివరించారు. మరే ప్రభుత్వమూ అమలు చేయని విధంగా.. అవినీతి వ్యతిరేకంగా.. లబ్ధిదారులకే పథకాలు అందేలా చేస్తున్నామన్నారు సీఎం. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకే డబ్బులను వేశామన్నారు. ప్రతీ పథకం అమలులోనూ.. సోషల్ ఆడిట్ తప్పని సరి చేశామన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపి చేస్తున్నామన్నారు. 76 సంవత్సరాల్లో మరే ప్రభుత్వం ఇలా చేయలేదన్నారు. సామాజిక న్యాయాన్ని అమలు చసి చూపించామన్నారు. మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు సీఎం జగన్. #andhra-pradesh #vijayawada #cm-ys-jagan #andhra-pradesh-cm-ys-jagan #indira-gandhi-stadium #cm-jagan-hoists-flag మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి