విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్ధం చేశారు. శకటాల ప్రదర్శనను తిలకించిన సీఎం జగన్.. అనంతరం పలువురికి అవార్డులను అందజేస్తారు.