Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సంచలన వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్..

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించామన్నారు.

Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సంచలన వివరాలు వెల్లడించిన సీఐడీ చీఫ్..
New Update

Chandrababu Arrest Updates: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్(AP CID Chief Sanjay Kumar) సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్(Skill Development Scam) జరిగినట్లు గుర్తించామన్నారు. ఇదే విషయమై ప్రెస్‌మీట్ పెట్టి వివరాలను వెల్లడించారు సంజయ్ కుమార్. సిమెన్స్ ద్వారా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎంవోయూలో పేర్కొనలేదని స్పష్టం చేశారు. రూ. 241 కోట్లు నేరుగా ఒక కంపెనీకి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు వెళ్లాయని వివరించారు. ఈ కేసులో 10 అంశాలను గుర్తించామన్నారు. ఈ కేసులో ఈడీ ఎంటర్ అయిందని, చాలా మందిని అరెస్ట్ చేసిందన్నారు. 2021లో ఏపీ సీఐడీ ఈ స్కామ్‌పై కేసు నమోదు చేసిన తరువాత చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు సంజయ్ కుమార్. చంద్రబాబు 13 ప్రదేశాల్లో సంతకాలు చేశారని వివరించారు ఏసీ సీఐడీ చీఫ్. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో రూ. 370 కోట్లు రిలీజ్ చేయమని ఆర్డర్ చేశారని తెలిపారు. జె వెంకటేశ్వర్లు అనే ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నారని అన్నారు

అలాగే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో.. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారీ చేయడం జరిగిందని, తప్పుడు పత్రాలతో ఒప్పందాలు చేసినట్లు గుర్తించామన్నారు ఏసీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్. అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని, జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందని, నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారన్నారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ జీవోలకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు వున్నాయని, అగ్రిమెంట్‌లో జీవో నెంబర్‌ను చూపించలేదని.. జీవోలో వున్న అంశాలు అగ్రిమెంట్‌లో లేవని వివరించారు సీఐడీ చీఫ్. జీవో కంటే ముందే అగ్రిమెంట్ తయారైందన్నారు. అంతేకాదు.. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదని పేర్కొన్నారు. కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని, ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయి కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.

Also Read:

BIG BREAKING: వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్

AP BJP: పొత్తులపై తుది నిర్ణయం జాతీయ నాయకత్వానిదే.!

#chandrababu-naidu-arrest #andhra-pradesh #andhra-pradesh-govt #chandrababu-naidu #sanjay-kumar #skill-development-scam-case #cid-chief
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి