ఏపీలో (Andhra Pradesh) అధికార పార్టీ ఎమ్మెల్యేపై బాంబు దాడి ఘటన కలకలం రేపుతోంది. పెనుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ (MLA Shankar Narayana) కాన్వాయ్ కొందరు దుండగులు పై బాంబును విసిరారు. అయితే.. అది పేలక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు (AP Police) వెంటనే ఆ పేలుడు వస్తువును విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. నిందితులు ఎవరు? ఈ పని చేయించింది ఎవరు? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: Fake documents: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..?
ఎమ్మెల్యే శంకర్ నారాయణ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం తాజాగా 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గోరంట్ల మండలంలో సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీ ఊరిగింపుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుపై బాంబు దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: లవ్ స్టోరీలో పోలీసుల ఓవరాక్షన్..అవమానం భరించలేక యువకుడు ఏం చేశాడంటే..?
ఎమ్మెల్యేపై దాడి జరగడంతో పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దాని వెనక ఎవరు ఉన్నారో తేల్చాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు లేదా రేపటిలోగా పూర్తి విషయాలు బయటకు వస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే దాడి జరగడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దాడికి తెగబడింది ప్రత్యర్థి పార్టీ నేతలా? లేక ఫాక్షన్ కోణంలో ఏమైనా దాడి జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.