Fake documents: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..? తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. పేద ప్రజలనే టార్గెట్ చేసి లక్షల రూపాయలను దున్నుకుంటున్నారు. అధికారుల పేరు చెప్పి.. మాయమాటలతో అమాయకులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధితుల విజ్ఞప్తి చేస్తున్నారు. మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద ప్రజలు ఆశకు పోయి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 08 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీలో నకిలీ పత్రాల తయారీదారుల దందా రోజు రోజుకు పెరిగి పోగుతున్నారు. ఇళ్ళు ఇప్పిస్తానని పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ పేద ప్రజలకు కేటాయించిన.. అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో రియల్ఎస్టేట్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల పేరుతో నకిలీ పత్రాలు కలకలం రేపాయి. నకిలీ పత్రాల పేరుతో, టిడ్కోఇళ్ళు ఇస్తామని ఎంపీ కేశినేని నాని అనుచరుడు హబీబ్ మోసం చేశాడు. పేదవారికి మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్మించిన కబేల జిన్నూర్మ్ (JNNURM) కాలనీలో ఫ్లాట్ ఇప్పిస్తానంటూ మోసాలు చేశాడు. ఒక్కొక్క ప్లాటు మూడు లక్షల 50 వేల రూపాయలకే అమ్మకలు చేశాడు. దాదాపు 300 మంది వద్ద నుంచి 4 కోట్లు వరకు కేటుగాళ్ళు వసూలు చేశారు. అమాయకుల నుంచి లక్షలు వసూళ్లు కేశినేని నాని అనుచరుడు హాబీబ్తో పాటు చికెన్ కొట్టు లాలా బాజీబాబా అలియాస్ బాబీతో పాటు అన్నపూర్ణ అనే మహిళ కలిసి ఓ గ్యాంగ్గా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. గోకుల్ అనే వ్యక్తి నుంచి అతని బంధువులు మరియు స్నేహితులు నుంచి ఈ గ్యాంగ్ దాదాపు 30 లక్షలు వసూల్ చేశారు. ఈ కేటుగాళ్ళు నమ్మి మోసపోయమని బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫ్లాట్ స్కాంలలో పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా మోసపోతున్నారని పోలీసులు చెపుతున్నారు. కార్పొరేషన్ అధికారుల పేరుతో నకిలీ పత్రాలను అందచేసి కాలనీలోని ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కట్టించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన జరగడంతో కొత్తపేటలోఉండే బాధితుడు కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో భూమికి పోర్జరీ సంతకాలతో.. కడప జిల్లాలో గత నెల 26న ఆర్టీవీ ఎఫెక్ట్ పడిన విషయం తెలిసిందే. బిడ్డా.. నా అడ్డాలో అక్రమాలకు నో అబ్జక్షన్పై అధికారులు స్పందించారు. కలెక్టర్ సంతకం పోర్జరీ చేసిన కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి వద్ద నుంచి ఫోర్జరీ సంతకానికి ఉపయోగించిన కంప్యూటర్, మానిటర్, సీపీయుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో మండల సర్వేయర్, వీఆర్వో ప్రమేయం ఉన్నట్లు విచారణలో సీఐ రాజు వెల్లడించారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదన కోసం చుక్కల భూమికి పోర్జరీ సంతకాలతో ఎన్వోసీలనం సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారు నిందితులు. చుక్కల భూములను ఎన్వోసీ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే అధిక ధరలకు భూములు ఆమ్ముకోవచ్చని ఆశ చూపి రిజిస్ట్రేషన్ చేయించారు నిందితులు. కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ ఎన్వోసీలు సృష్టించి లక్షల్లో డబ్బులు వసూలు చేసి నిజమైన పత్రాలుగా నమ్మించి నయవంచన చేసిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే విజయవాడలో మరో ఘటన కలకలం రేపింది. ఇది కూడా చదవండి: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేకతలు ఇవే..!! #fake-documents #jnnurm-colony #vijayawada #name-of-corporation-officers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి