Big Breaking: వైసీపీ ఎమ్మెల్యేపై బాంబు దాడి
పెనుకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై ఈ రోజు బాంబు దాడి జరిగింది. గోరంట్ల మండలంలో భారీగా ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరారు. అయితే.. అది పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.