Anasuya Bharadwaj Fires On Animal Movie : సోషల్ మీడియా (Social Media) లో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ (Anasuya Bharadwaj) తాజాగా 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేసింది. అతను డైరెక్ట్ చేసిన 'యానిమల్' సినిమా నుంచి రెండు సన్నివేశాలను తన సోషల్ మీడియా లో షేర్ చేసి మీది హిపోక్రసీ అయితే.. నన్ను హైపోక్రైట్ అంటారా? అని ప్రశ్నిస్తూ వీడియో పోస్ట్ చేసింది.
భార్యకో న్యాయం? అక్కకో న్యాయమా?
'యానిమల్' (Animal) సినిమాలో తన తండ్రిని చంపేందుకు ప్లాన్ చేసిన సొంత బావను చంపేస్తాడు. ఈ విషయాన్ని తన అక్కకు చెప్పి నువ్వు స్టాంగ్ ఉమెన్, కావాలంటే ఇంకో పెళ్లి చేస్కో, నేనే అబ్బాయిని వెతికిపెడతా అని అంటాడు. అదే మరో సీన్ లో తన భార్యకు మాత్రం నేను యుద్దానికి వెళ్తున్నమళ్ళీ తిరిగొస్తానో రానో తెలియదు, ఒకవేళ రాకపోతే ఇంకో పెళ్లి మాత్రం చేసుకోవద్దు అని చెబుతాడు.
Also Read : ప్రభాస్ ‘బుజ్జి’ మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..!
ఈ రెండు సీన్స్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేసిన అనసూయ మగవాళ్ళు భార్య విషయంలో ఒకలా, అక్క విషయంలో మరోలా ఆలోచిస్తారా?అని ప్రశ్నించింది. నన్ను హైపోక్రైట్ అంటారా? అని కామెంట్ చేసింది. ఎప్పుడూ విజయ్ దేవరకొండను టార్గెట్ చేసే అనసూయ ఈసారి సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసాయడం గమనార్హం. మరి అనసూయ కామెంట్స్ పై సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ఎలా స్పందిస్తారో చూడాలి.