Bollywood: బాలీవుడ్ యంగ్ బ్యూటీ, స్టార్ కిడ్ అనన్యా పాండే సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు నటీమణులతో తనకున్న బంధంపై కూడా ఓపెన్ అయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న నటి.. సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని చెప్పింది.
నేనే ప్రత్యక్ష సాక్ష్యం..
ఈ మేరకు హీరోయిన్ల మధ్య ఉండే బాండింగ్, స్నేహంపై కూడా ట్రోలింగ్ చేయడం బాధాకరం. కలిసి పనిచేస్తున్నప్పుడు స్నేహితులను చేసుకోకూడదని ఏ ఒక్క నటి అనుకోదు. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బయటి వాళ్లు మా మధ్య సాంగత్యాన్ని ఎప్పటికీ చూడలేరని నా అభిప్రాయం. మా అందరిమధ్య మంచి వాతావరణం ఉంది. దీపికా, భూమి పెడ్నేకర్ లాంటి వారితో పనిచేసే అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతా. ఇప్పటికీ నన్నెంతో మంది ట్రోల్స్ చేస్తుంటారు. అయినా ఇలాంటివి నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేవు' అంటూ చెప్పుకొచ్చింది.