Anantapur : అనంతపురం జిల్లా కేంద్రీయ విద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుంది. విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ లైబ్రరీయన్‌పై దాడి చేశారు తల్లిదండ్రులు. గత కొన్ని రోజులుగా విద్యార్థులను వేధిస్తున్నారని పిల్లలు ఆరోపణ చేయటంతో.. ఇవాళ పాఠశాల వద్దకు చేరుకొని లైబ్రరీయన్‌కు దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. గతంలో ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వారు ఆరోపించారు. అయితే పిల్లల్ని నేను కొట్టలేదని లైబ్రరీయన్ అంటున్నారు. రంగలోకి దిగిన పోలీసులు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కొద్ది సేపు టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇలాంటి వారిని ఉద్యోగం లోనుంచి తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.
పిల్లల చదువు విషయంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి వరకు విద్యార్థుల్లో బహుముఖ నైపుణ్యాలకు దోహదం చేస్తున్న సంస్థల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి. అయితే పిల్లలకు భవిష్యత్త్‌కు పునాదిగా భావించే పాఠశాల విద్యలో ఇది ఎంతో అవసరం ఉటుంది. ఇలా గుర్తుండాలంటే బోధన వినూత్న పద్ధతుల్లో.. విద్యార్థులను ఆకట్టుకునేలా సాగాలి. అప్పుడే వారు చదువుకున్న పాఠాలు ఏళ్లపాటు గుర్తుండిపోతాయని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు క్రియేటివ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను అందిస్తూ.. చదివిన చదువు వారికి పది కాలాల పాటు గుర్తుండేలా పునాదులు వేస్తున్నాయి కేంద్రీయ విద్యాలయాలు. అయితే ఇప్పుడు ఈ కేంద్రీయ విద్యాలయలం గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. లైబ్రరీయన్ చేసిన పనికి తల్లిదండ్రులు దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
అయితే పిల్లలపై ఇలా అసభ్యంగా ప్రవర్తించే వారిని స్కూల్‌లో ఉంచవద్దని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కూల్‌కి ఇలా చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనలోనూ మార్పులు తెస్తూ.. వైవిధ్యతకు కేరాఫ్‌గా నిలుస్తున్న కేంద్రీయ విద్యాలయాలంలో ఇలా పిల్లలపై అసభ్యంగా ప్రవర్తచడం బాధకరం అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.A
Also Read: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!!