Anant Ambani Pre Wedding: ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈరోజు అంటే మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. గుజరాత్ లోని (Gujarat) జామ్ నగర్ లో జరగనున్న ఈ సెలబ్రేషన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ, క్రీడా కారులు హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్‌చరణ్ (Ram Charan) హాజరుకానున్నారు. ఈ వివాహ వేడుకలో తన భార్య ఉపాసనతో కలిసి ఈయన పాల్గొననున్నారు. రామ్‌చరణ్ తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన భార్యాపిల్లలతో కలిసి సందడి చేయనున్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కరే ఈ వేడుకలకు వెళుతున్నారు.
పూర్తిగా చదవండి..Anant Ambani Pre Wedding: అంబానీ ఇంట వేడుక.. టాలీవుడ్ నుంచి గేమ్ ఛేంజర్!
ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈరోజు అంటే మార్చి1 సాయంత్రం ప్రారంభం కానున్నాయి. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు పాల్గొంటున్నారు.
Translate this News: