Kalki 2898 AD Update: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా.. భారీ బడ్జెట్ సినిమా.. ఇది ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇప్పుడు సలార్ తరువాత ప్రభాస్ కల్కి 2898 AD అనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా. ఇక ఈ సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి బయటకొస్తున్న అప్ డేట్స్ అందర్నీ పిచ్చెక్కిస్తున్నాయి. సినిమా కాస్టింగ్ గురించి తెలుస్తున్నకొద్దీ అందరికీ షాకింగ్ గా ఉంటోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ఇప్పటివరకూ సినిమా(Kalki 2898 AD)లో చేస్తున్నారు అని చెప్పారు. వీళ్ళు మాత్రమే కాదు.. నాని (Hero Nani), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా అతిధి పాత్రల్లో కనిపించనున్నారనే వార్త ఈ మధ్య వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ యాక్టర్ కనిపిస్తారని చెబుతున్నారు. టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఆ వార్త ప్రకారం ఆ స్టార్ యాక్టర్ ఇంతకు ముందు ఎప్పుడూ ప్రభాస్ సినిమాల్లో కనిపించలేదు. మరి ఆ యాక్టర్ ఎవరు? తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: ప్రభాస్ తో ఆయన.. మొదటిసారిగా.. కల్కి నుంచి సూపర్ అప్ డేట్!
రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి' 2898 AD. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
Translate this News: