/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-18-2-jpg.webp)
Anant Ambani : డబ్బులుంటే.. జీవితంలో అన్నీ కాళ్ళ దగ్గరకే వచ్చి పడితే, తల్లిదండ్రులు ఫేమస్ వ్యక్తులు అయిపోతే జీవితం పూలపాన్పు అనుకుంటాము. కానీ అది నిజం కాదు. డబ్బుంటే సుఖం రాదు. మనకు నచ్చినట్టు అన్నీ ఉండవు. ఇందుకు పెద్ద ఉదాహరణ ముఖీష్(Mukesh Ambani), నీతా అంబానీ(Nita Ambani) ల ముద్దుల చిన్న కొడుకు అనంత్ అంబానీ(Anant Ambani) జీవితమే. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకలను(Pre-Wedding Celebrations) ఘనంగా జరుపుకుంటున్న అనంత్... తాను పుట్టడం అయితే గోల్డెన్ స్పూన్‌తో పుట్టా కానీ లైఫ్ జర్నీ(Life Journey) మాత్రం చాలా టఫ్ అని చెబుతున్నాడు.
ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్(Gujarat) లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో దేశ విదేశాల నుంచి వచ్చిన ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం అందరూ తమ ఆనందాన్ని మాటల్లో పంచుకున్నారు. ఇందులో అనంత్ అంబానీ కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా తన జీవితం గురించి చెప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల(Health Diseases) గురించి, తల్లిదండ్రులు తనను ఎలా సపోర్ట్ చేశారు అన్ని వివరంగా చెప్పుకొచ్చాడు. తన జీవితం పూలపాన్పు కాదని.. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నా ఓర్చుకుంటూ వచ్చానని తెలిపాడు. చాలా దుఃఖాన్ని అనుభవించానని చెప్పాడు. అయితే అన్ని వేళల్లో తల్లిదండ్రులు మాత్రం తనను సపోర్ట్ చేస్తూనే ఉన్నారని.. తాను అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారని అన్నాడు. దానికి వారికి ఎప్పుడూ రుణపడే ఉంటానని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. కొడుకు మాటలు విన్న ముఖేష్ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్ళను వెక్కి వెక్కి ఏడ్చేశారు.
ఇక తన స్పీచ్‌లో అనంత్ అంబానీ తన కాబోయే భార్య రాధిక(Radhika) గురించి, తన అక్కా, అన్నయ్యలు... తల్లి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాడు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం వాళ్ళు ఎంత కష్టపడిందీ వివరించాడు. తన తల్లి నీతా అంబానీ అయితే రోజుకు 18-19 గంటలు పని చేస్తున్నారని తెలిపాడు. మొత్తం కుటుంబం అంతా రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని.. చాలా కష్టపడుతున్నారని వివరించాడు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అనంత్ అంబానీ స్పీచ్, ముఖేష్ భావోద్వేగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో చక్కర్లు కొడుతోంది. చాలా ఎక్కువ మంది అనంత్ స్పీచ్‌ను చూస్తున్నారు.
డబ్బులుంటే.. జీవితంలో అన్నీ కాళ్ళ దగ్గరకే వచ్చి పడితే, తల్లిదండ్రులు ఫేమస్ వ్యక్తులు అయిపోతే జీవితం పూలపాన్పు అనుకుంటాము. కానీ అది నిజం కాదు. డబ్బుంటే సుఖం రాదు. మనకు నచ్చినట్టు అన్నీ ఉండవు. ఇందుకు పెద్ద ఉదాహరణ ముఖీష్, నీతా అంబానీల ముద్దుల చిన్న కొడుకు అనంత్ అంబానీ జీవితమే. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న అనంత్...తాను పుట్టడం అయితే గోల్డెన్ స్పూన్‌తో పుట్టా కానీ లైఫ్ జర్నీ మాత్రం చాలా టఫ్ అని చెబుతున్నాడు.
ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో దేశ విదేశాల నుంచి వచ్చిన ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం అందరూ తమ ఆనందాన్ని మాటల్లో పంచుకున్నారు. ఇందులో అనంత్ అంబానీ కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా తన జీవితం గురించి చెప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి, తల్లిదండ్రులు తనను ఎలా సపోర్ట్ చేశారు అన్ని వివరంగా చెప్పుకొచ్చాడు. తన జీవితం పూలపాన్పు కాదని..ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నా ఓర్చుకుంటూ వచ్చానని తెలిపాడు. చాలా దుఃఖాన్ని అనుభవించానని చెప్పాడు. అయితే అన్ని వేళల్లో తల్లిదండ్రులు మాత్రం తనను సపోర్ట్ చేస్తూనే ఉన్నారని..తాను అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారని అన్నాడు. దానికి వారికి ఎప్పుడూ రుణపడే ఉంటానని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. కొడుకు మాటలు విన్న ముఖేష్ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్ళను వెక్కి వెక్కి ఏడ్చేశారు.
ఇక తన స్పీచ్‌లో అనంత్ అంబానీ తన కాబోయే భార్య రాధిక గురించి, తన అక్కా, అన్నయ్యలు...తల్లి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాడు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం వాళ్ళు ఎంత కష్టపడిందీ వివరించాడు. తన తల్లి నీతా అంబానీ అయితే రోజుకు 18-19 గంటలు పని చేస్తున్నారని తెలిపాడు. మొత్తం కుటుంబం అంతా రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని..చాలా కష్టపడుతున్నారని వివరించాడు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అనంత్ అంబానీ స్పీచ్, ముఖేష్ భావోద్వేగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా ఎక్కువ మంది అనంత్ స్పీచ్‌ను చూస్తున్నారు.
WATCH | Anant Ambani expresses gratitude to family, love for Radhika Merchant, speaks on health challenges & Vantara in speech at pre-wedding celebrations; Mukesh Ambani gets emotional
(Video courtesy - @ZoomTV) #AnantAmbani #RadhikaMerchant #AmbaniPreWedding pic.twitter.com/AhH9fehIsQ
— ET NOW (@ETNOWlive) March 2, 2024
Also Read:Mahesh Babu: డీజే టిల్లుగా మారిన ప్రిన్స్.. రాధికతో అదే రచ్చ!