వర్షకాలం వచ్చిందంటే చాలు.. దొమల బెడత విపరీతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. దోమల నివారణకు స్థానిక యంత్రాంగ చర్యలు తీసుకున్నప్పటికీ ఇది పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కూడా ఈ సమస్య ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో స్పందించారు. దోమలను చంపే ఓ పరికరానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దీన్ని ఆయన 'మీ ఇంటికి ఇది ఐరన్‌డోమ్ లాంటిద'ని పేర్కొన్నారు.
Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు
'' ముంబయిలో డెంగీ కేసులు పెరుగుతున్న క్రమంలో.. ఈ చిన్నపాటి ఫిరంగీని ఎలా పొందాలనే దానిపై ప్రయత్నిస్తున్నాను. చైనా వ్యక్తి తయారు చేసిన ఈ పరికరం.. దోమలను వెతికి పట్టుకుని చంపేస్తుంది. ఇది మీ ఇంటికి ఐరన్‌డోమ్ లాంటిదంటూ '' రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో గమనిస్తే.. ఆ పరికరాన్ని ఓ ఇంట్లోని గదిలో పెట్టారు. దాని బాడీ రౌండ్‌గా తిరుగుతూ దోమలను పట్టుకొని చంపేస్తోంది.
ఈ పరికరం యాంటీ-మిసైజ్ డిఫెన్స్ సిస్టమ్‌ను పోలిఉంది. ఇందులో ఓ రాడర్ వ్యవస్థను కూడా అమర్చారు. ఇది చుట్టుపక్కల ఉన్న దోమలను వెంటనే గుర్తిస్తుంది. ఆ తర్వాత దీనిలో ఉన్న లేజర్ పాయింటర్ దోమలను చంపేస్తుంది. అయితే ఈ వీడియోను 2023, డిసెంబర్‌లో చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ విబోలో షేర్ చేశారు. ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్ కారులో ఉన్న రాడర్‌ను కాస్త మార్చేసి ఈ పరికరాన్ని తయారుచేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఆనంద్ మహీంద్రా దీన్ని మళ్లీ షేర్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది.
Also Read: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్