ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఆయన చెప్పేవి ఆసక్తికరంగానూ.. మరికొన్ని స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. ఏదైన కొత్తగా ఆవిష్కరణలు చేసేవాళ్లని.. పట్టుదలతో ఏదైన సాధించిన మట్టిలో మణిక్యాలను తన ట్వీట్ల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు మరింత వెలుగులోకి తీసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. అయితే ఇప్పుడు మరో వ్యక్తి ఆయన మనసును కదిలించారు. దినసరి కూలి నుంచి ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన రామ్‌బాబుకు ఆనంద్ మహీంద్ర ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా బౌవార్ పల్లెకు చెందిన రామ్ బాబు అనే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. వారి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తాను కన్న కలలను నెరవేర్చుకునేందుకు పట్టుదలతో ముందుకు సాగాడు రామ్ బాబు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అతడు నిరాశ పడలేదు. ప్రాక్టీస్‌ను కూడా ఆపలేదు.
Also Read: భారత్-శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభం..టికెట్ ధరలో ఎంత డిస్కౌంటో తెలుసా!
అయితే గత ఏడాది జాతీయ క్రీడల్లో 35 కిలోమీటర్ల నడకలో 2 గంటల 36 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు సాధించాడు. దీంతో ఈ ప్రదర్శన అతడ్ని ఆసియా క్రీడల్లో పోటీపడేలా చేసింది. అక్కడ కూడా రామ్ బాబు తన సత్తా చాటి కాంస్యంతో మెరిశాడు. అతడు సాధించిన దానిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. అతడి స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుని చలించిపోయారు. రామ్‌బాబుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన పోస్టు చేశారు. ఒక కూలీ ఆసియా క్రీడల్లో పతక సాధించి విజేతగా నిలిచాడు. అతడి సంకల్పం, దైర్యంతో ఇది సాధ్యమైంది. దయచేసి అతడి ఫోన్ నెంబర్ ఇవ్వండి. అతని కుటుంబానికి కావాల్సిన ఏదైనా ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించాలని అనుకుంటున్నానని ట్వీట్ చేశారు. దీంతో పాటు రామ్ బాబుకు సంబంధించినటువంటి ఓ వీడియోను కూడా జత చేశారు.