Thar : మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా.. సర్ఫరాజ్‌ తండ్రికి ‘థార్‌’ అందజేత

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గత నెలలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అదిరే ప్రదర్శన చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ కుటుంబానికి మహీంద్రా థార్ ను బహుమతిగా అందించారు.

author-image
By Durga Rao
New Update
Thar : మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా.. సర్ఫరాజ్‌ తండ్రికి ‘థార్‌’ అందజేత

Anand Mahindra : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు(M&M Group) ల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియా(Social Media) లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. కొత్త ఆవిష్కరణలు, క్రీడలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇందులో భాగంగానే నూతన ఆవిష్కరణలు చేసినవారు, ఆటలో అపార ప్రతిభ చూపిన వారికి బహుమతులు ఇవ్వడం ఆయనకు అలవాటు. ఇప్పటికే చాలా సార్లు దాన్ని ఆయన రుజువు చేసుకున్నారు.

తాజాగా మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు ఆనంద్‌ మహీంద్ర. చెప్పిన మాట ప్రకారం ఇటీవలే టీమిండియా(Team India) లోకి అరంగేట్రం చేసి.. అదరగొడుతున్న యంగ్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ కుటుంబానికి మహీంద్ర థార్ కారును బహుమతిగా అందించారు.

కాగా సర్ఫరాజ్ ఖాన్‌(Sarfaraz Khan).. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ద్వారా తొలిసారి టీమిండియా జెర్సీ ధరించిన ఈ ప్లేయర్‌.. తొలి సిరీస్‌లోనే అదిరే ప్రదర్శన చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు హాఫ్‌ సెంచరీలు స్కోర్ చేశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. సర్ఫరాజ్‌ ప్రదర్శన పట్ల ఆనంద్‌ మహీంద్రా అప్పట్లోనే స్పందించారు. అతడి ఆటకు ఫిదా అయిపోయారు.

Also Read : త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.!

సర్ఫరాజ్‌ను ఇంతలా రాటు దేల్చిన అతడి తండ్రి నౌషాద్‌ ఖాన్‌కు థార్‌ కారు(Thar Car) ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌(X) లో సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూనే ఈ మేరకు పోస్టు చేశారు. “ధైర్యం కోల్పోవద్దు. శ్రమ, ధైర్యం, సహనం. పిల్లల్లో స్ఫూర్తి నింపాలంటే ఓ తండ్రికి ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది. స్పూర్తిదాయకమైన ఫాదర్‌గా నౌషాద్ ఖాన్ ‘మహీంద్రా థార్’ను కానుకగా స్వీకరిస్తే అదే నాకు ఆనందం” అని నెల రోజుల క్రితం ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు.

తాజాగా ఆనంద్‌ మహీంద్రా తాను ఇచ్చిన ప్రామిస్‌ను నిలబెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో నౌషద్‌తో పాటు.. సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా ఉన్నాడు. ఈ ఫొటోలను సర్ఫరాజ్‌ ఖాన్‌ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ఆడటం లేదు. గతేడాది జరిగిన మినీ వేలంలో అతడ్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.

Advertisment
తాజా కథనాలు