Crime News: మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి!! కృష్ణా జిల్లా పెడనలో ఓ వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. కప్పల దొడ్డికి చెందిన పంతం బలరాం అనే వ్యక్తి మంగళవారం ఉదయం రోజూ లాగే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వచ్చి బలరాంపై కత్తులతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బలరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బలరాంను స్థానికులు మచిలీ పట్నలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బలరాం నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. తనపై యర్రా దేవన్, యర్రా జీవన్ లు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డాడని బలరాం వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. By E. Chinni 15 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి కృష్ణా జిల్లా పెడనలో ఓ వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది. కప్పల దొడ్డికి చెందిన పంతం బలరాం అనే వ్యక్తి మంగళవారం ఉదయం రోజూ లాగే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వచ్చి బలరాంపై కత్తులతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బలరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బలరాంను స్థానికులు మచిలీ పట్నలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స అనంతరం బలరాం నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. తనపై యర్రా దేవన్, యర్రా జీవన్ లు కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డాడని బలరాం వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా బలరాం గతంలో రౌడీ షీటర్ అని ప్రచారం జరుగుతోంది. ఇక పోతే మచిలీ పట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బలరాంని మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పరామర్శించారు. మరోవైపు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఘటన ఉదయం జరగ్గా.. ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. #vijayawada #crime-news #latest-news #crime #knife #pedana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి