Bihar Crime: దారుణం..మహిళను వివస్త్రను చేసి ..మూత్రం తాగించి

1500 రూపాలయల అప్పును తిరిగి చెల్లించనప్పటికీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే కాకుండా మహిళను వివస్త్రను చేసి ఆమెతో బలవంతంగా మూత్రం తాగించిన దారుణ ఘటన తాజాగా బీహార్‌ (Bihar) లో వెలుగు చూసింది.

Bihar Crime: దారుణం..మహిళను వివస్త్రను చేసి ..మూత్రం తాగించి
New Update

రాను రాను సమాజంలో మహిళల పట్ల గౌరవం తగ్గిపోతుంది. తీసుకున్న 1500 రూపాలయల అప్పును తిరిగి చెల్లించనప్పటికీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే కాకుండా మహిళను వివస్త్రను చేసి ఆమెతో బలవంతంగా మూత్రం తాగించిన దారుణ ఘటన తాజాగా బీహార్‌ (Bihar) లో వెలుగు చూసింది.

బీహార్ లోని పాట్నా(Patna)లో ఓ దళిత మహిళ ఊర్లోని ప్రమోద్ సింగ్‌ (Pramod singh) అనే వ్యక్తి దగ్గర కొంత కాలం క్రితం రూ.1500 అప్పుగా తీసుకుంది. అయితే ఆమె ఆ నగదును వారికి తిరిగి ఇచ్చేసింది. అయినప్పటికీ కూడా వారు ఆమెను ఇంకా డబ్బులు ఇవ్వాల్సిందిగా వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఆమె పోలీసులు (Police) కు ఫిర్యాదు చేసిన విషయం అప్పు ఇచ్చిన ప్రమోద్‌ కి తెలియడంతో వారు మహిళ మీద కోపాద్రిక్తులైయ్యారు. దీంతో మహిళను మరింత వేధించసాగారు. వడ్డీకి వడ్డీ లెక్కలు చూపించి ఇంకా ఇవ్వాలని చెబుతున్నారు.

దీంతో మహిళ ఆమె మీద ఎదురు తిరగడంతో ఆమెను వివస్త్రను చేసి ఊరంతా తిప్పుతామని బెదిరించారు. వారు అన్నట్లుగానే శనివారం రాత్రి మహిళను ఆమె ఇంటి వద్ద నుంచి ప్రమోద్‌ ఇంటికి తీసుకుని రావడమే కాకుండా ఆమెను వివస్త్రను చేయడమే కాకుండా కర్రలతో, చెప్పులతో బలంగా కొట్టారు.

దీంతో మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. వారు అంతటితో ఆగకుండా ప్రమోద్‌ తన కుమారుడికి ఆమె మీద మూత్ర విసర్జన చేయమని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో అతను మహిళ నోట్లో మూత్ర విసర్జన చేశాడు. ఆమె మీద తీవ్రంగా దాడి చేయడంతో ఆమె ముఖం , కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆమె నిందితుల ఇంటి వద్ద నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆమె ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి గురించి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

#crime #bihar #patna #dalit-woman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe