Pawan Kalyan: కౌన్‌ బనేగా కరోడ్‌పతి లో పిఠాపురం ఎమ్మెల్యే పై ప్రశ్న!

కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం 16 వ సీజన్‌ రన్‌ అవుతుంది.తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్‌ స్టార్‌ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ ​గా మారింది.

author-image
By Bhavana
New Update
pawan kalyan

Pawan Kalyan :

కౌన్‌ బనేగా కరోడ్‌పతి గురించి యావత్‌ ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం 16 వ సీజన్‌ రన్‌ అవుతుంది. ముందు నుంచి కూడా ఈ షోకి బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చనే హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్‌ స్టార్‌ పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడగటం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ ​గా మారింది. 

‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు?’ అని ప్రశ్న వేశారు. కంటెస్టెంట్‌ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్‌ పోల్‌’ ఆప్షన్‌ తీసుకున్నారు. చాలా మంది 50 శాతం మందికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని కరెక్ట్​గా జవాబిచ్చారు. వారు పవన్‌ పేరు చెప్పి లాక్‌ చేశారు. దీంతో అది కరెక్ట్ అన్సర్ కావడం వల్ల కంటెస్టెంట్‌ రూ.1.60లక్షలు గెలిచుకున్నారు.

పవన్‌ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. అయితే ఆయన నుంచి సుజీత్​ ఓజీ, హరి హర వీరమల్లు, హరీశ్ శంకర్ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలు రాబోతున్నాయి. ఇవి ప్రస్తుతం షూటింగ్‌ మధ్య దశలో ఉన్నాయి. ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. త్వరలోనే పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూడు చిత్రాల ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే.

Also Read: సంక్రాంతి బండి..మొత్తం ఫుల్లండి!

Advertisment
తాజా కథనాలు