ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి నక్సలిజంపై సంచలన కామెంట్స్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలోగా నక్సలిజం ఆనవాళ్లు లేకుండా అంతమొందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం బాఘేల్ సర్కారు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు.

New Update
ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)మరోసారి నక్సలిజంపై సంచలన కామెంట్స్ చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలోగా నక్సలిజం ఆనవాళ్లు లేకుండా అంతమొందిస్తామని హామీ ఇచ్చారు. గురువారం రాష్ట్రంలోని జష్‌పూర్, కుంకూరి, చంద్రపూర్ నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో అమిత్‌షా ప్రసంగించారు. కేంద్రంలో, రాష్ట్రంలో బలం కలిగిన డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడితే నక్సలిజం అంతానికి మార్గం సుగమం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పాలన వేళ రాష్ట్రంలో విపరీతంగా బలవంతపు మత మార్పిడులు జరిగాయని, సీఎం బాఘేల్ సర్కారు వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు.

Also read : ప్రభుత్వాసుపత్రిలో దారణం.. పాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లిన సిబ్బంది ఏం చేసిందో తెలుసా?

అలాగే 'మహాదేవ్' బెట్టింగ్ గేమ్ యాప్ స్కాంలోనూ ఛత్తీస్‌గఢ్ సీఎం పేరు ఉందని అమిత్‌షా తెలిపారు. సట్టే (బెట్టింగ్ యాప్) పే సత్తా.. కౌన్ కర్ రహా హై.. భూపేష్ (సీఎం) కాకా' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భూపేష్ బఘేల్‌ను ఛత్తీస్‌గఢ్‌లో 'కాకా' (మామ) అని పిలుస్తారు. రాష్ట్రంలో బీజేపీ గెలవగానే అవినీతి కుంభకోణాలపై విచారణ కమిషన్‌ వేసి అవినీతికి పాల్పడిన అందరినీ జైలుకు పంపుతామని షా స్పష్టం చేశారు. అలాగే ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్‌ను విజయవంతంగా చేపట్టి విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టింది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్‌ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేవుడి పేరుతో బెట్టింగ్‌ యాప్‌లను నిర్వహిస్తోందని విమర్శించారు. దేవుడి పేరుతో బెట్టింగ్‌ యాప్‌లు నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్‌ పార్టీ సిగ్గుపడాలి. భాజపా అధికారంలోకి రాగానే.. ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి అవినీతిపరులను జైలుకు పంపుతాం. ఆదివాసీల అనుమతి లేకుండా మత మార్పిడిలకు భాజపా అనుమతించదని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు