Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్‌ షా!

500 సంవత్సరాల క్రితం భారత దేశానికి పడిన గాయానికి కుట్టు వంటిది ఈ అయోధ్య రామ మందిరం అని అమిత్‌ షా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనడం ఓ మహత్తర ఘట్టం అని వివరించారు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్‌ షా!

Ram Mandir : అయోధ్య(Ayodhya) రామ మందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ(Prana Pratishtha) కార్యక్రమం ఎంత ఘనంగా జరిగిందో ప్రపంచ నలుమూలల ఉన్న ప్రతి హిందువు కి తెలిసిందే. అయోధ్యకు రాలేని వారు, రాని వారు ఆ అద్భుత కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షించి తరించారు.

ఈ క్రమంలో అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) స్పందించారు. 500 సంవత్సరాల క్రితం భారత దేశాని(India) కి పడిన గాయానికి కుట్టు వంటిది ఈ అయోధ్య రామ మందిరం అని ఆయన అభివర్ణించారు. 500 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అంతా ఎంతగానో నిరీక్షించిన అద్భు క్షణాలు ఇవి అని ఆయన అన్నారు.

జనవరి 22న జరిగే వేడుక ఎందరికో సమాధానం అని తెలిపారు చాలా మంది అయోధ్య టెంట్‌ లో ఉన్న రాముడు గర్భగుడిలోకి ఎప్పుడు వెళ్తాడని చాలా మంది అడిగే వారు. వారందరికీ కూడా జనవరి 22 సోమవారం నాడు జరిగిన వేడుకే సమాధానం అని అమిత్‌ షా అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ(PM Modi) పాల్గొనడం ఓ మహత్తర ఘట్టం అని అమిత్‌ షా వివరించారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను, మత విశ్వాసాలను భాషలను గౌరవించాలంటే 2014 ముందు ఉన్న ప్రభుత్వాలన్ని కూడా భయపడేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని అమిత్‌ షా తెలిపారు.

అహ్మదాబాద్‌(Ahmadabad) లోని రణిప్‌ వద్ద రామ మందిరాన్ని పునఃనిర్మించగా ఆ కార్యక్రమానికి అమిత్‌ షా హాజరయ్యారు. ఆ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also read: జాతీయ బాలికా దినోత్సవం .. జనవరి 24నే ఎందుకు?

Advertisment
తాజా కథనాలు