రాష్ట్రానికి బిమారు ట్యాగ్ తొలగించాం... మధ్య ప్రదేశ్ రిపోర్డు కార్డు విడుదల చేసిన అమిత్ షా....!

కాంగ్రెస్ సర్కార్ హయాంలో మధ్యప్రదేశ్ కు బిమారు( అభివృద్ధిలో వెనుకబాటు) అనే ట్యాగ్ లైన్ ఉండేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వ పాలనలో ఆ ట్యాగ్ లైన్ తొలగించగలిగామన్నారు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అంటే అభివృద్దికి మారు పేరుగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో వున్నా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందన్నారు.

author-image
By G Ramu
Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్!
New Update

కాంగ్రెస్ సర్కార్ హయాంలో మధ్యప్రదేశ్ కు బిమారు( అభివృద్ధిలో వెనుకబాటు) అనే ట్యాగ్ లైన్ ఉండేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వ పాలనలో ఆ ట్యాగ్ లైన్ తొలగించగలిగామన్నారు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అంటే అభివృద్దికి మారు పేరుగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో వున్నా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందన్నారు.

మధ్యప్రదేశ్‌ కు సంబంధించి 20 ఏండ్ల (2003-2023) రిపోర్ట్‌ కార్డును అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... అభివృద్ధి పరంగా వెనుకబడిన రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీలను కలిపి గతంలో బిమారు అనే వారు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... కాంగ్రెస్ హయాంలో మధ్యప్రదేశ్ కు బిమారు ట్యాగ్ లైన్ ఇచ్చిందని మండిపడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పాటైందన్నారు. అప్పటి నుంచి ఒక ఐదారేండ్లు మినహా మిగిలిన కాలమంతా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనే ఉందన్నారు. 2003 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగిందన్నారు. అప్పుడు బిమారు రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మిగిలి పోయిందన్నారు. అయితే బీజేపీ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్దిని పరుగులు పెట్టించి ఆ ట్యాగ్ ను తొలగించగలిగిందన్నారు.

ఇప్పుడు గోధుమల్లో 45 శాతం ఎగుమతులతో దేశంలోనే మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. 3.62 కోట్ల ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనా కింద నాణ్యమైన గ్రామీణ రహదారుల అభివృద్ది చేస్తూ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఉందన్నారు. పదేండ్ల పాలనలో రాష్ట్రానికి కాంగ్రెస్ రూ.లక్ష కోట్లు ఇచ్చిందన్నారు.

అదే బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ. 8 లక్షల కోట్లను రాష్ట్ర అభివృద్ది కోసం కేటాయించిందన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలన్నారు. ఆ సంప్రదాయాన్ని బీజేపీ ఎప్పుడూ పాటిస్తుందన్నారు. దేశంలో తమ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా అక్కడ తాము జవాబుదారీగా వ్యవహరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ తన 53 ఏండ్ల పాలనకు సంబంధించి రిపోర్టు కార్డు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

#congress #madhya-pradesh #amith-shah #shivaraj-singh #report-card
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe