Amit Shah : తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులు!

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం గాంధీ భవన్ కు చుట్టుకుంది. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు గాంధీభవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
Amit Shah : తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులు!

Amit Shah Morphing Video Case : రిజర్వేషన్లు రద్దు మీద అమిత్ షా(Amit Shah) మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్న వీడియోను బీజేపీ(BJP) సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై వేగంగా విచారణ చేయాలని పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) క్రియెట్ చేసిందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణలో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో అమిత్ షా మాట్లాడిన మాటలే మార్ఫింగ్ చేయడం... ఈ మధ్య కాలంలో రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా బీజేపీ మీద ఆరోపణలు చేస్తుండడమే వారి అనుమానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీంతో ఈ నకిలీ వీడియోకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు సైతం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విచారణ వేగవంతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ నేతృత్వంలో ఎనిమిది మంది అధికారుల బృందం ఢిల్లీ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు హైదరాబాద్ లో కాంగ్రెస్‌(Congress) పార్టీ రాష్ట్ర కార్యాలయం అయిన గాంధీ భవన్ కు వెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. అవసరం అయితే అరెస్టులు కూడా చేసే అవకాశం ఉందని సమాచారం.

ఆ వీడియో ఏంటి?
తాము మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇందులో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లతో పాటూ ఎస్టీ , ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని చెప్పినట్టు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో బీజేపీ దీని మీద స్పందించింది. అమిత్ షా అలా మాట్లాడలేదని…ఆయన వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దాంతో పాటు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:Andhra Pradesh: ఎన్నికల వేళ ఏపీలో వివాదం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్..

Advertisment
తాజా కథనాలు