తెలంగాణకు అమిత్ షా.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణకు రానున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న షా రాష్ట్రానికి రానున్నట్లు తెలిపిన ఆయన.. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.

తెలంగాణకు అమిత్ షా.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
New Update

కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్‌ తెలంగాణకు రానున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆగస్టు 27 ఖమ్మంలో జరిగే రైతు ఘోస బీజేపీ భరోసా సభలో షా పాల్గొంటారని వెల్లడించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ అసమర్ధ పాలనతో రైతాంగాన్ని ఆగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం లక్షల కోట్లు నష్ట పోయారన్నారు.

ఆపద సమయంలో రైతులను బీమా అందకుండా పోయిందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఉచింతంగా ఎరువులను పంపిణీ చేస్తామని హామి ఇచ్చిన కేసీఆర్‌ తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా సబ్సీడీ కొనసాగుతున్నా.. తెలంగాణలో మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సబ్సీడీ ఎందుకు ఇవ్వకవలేకపోతోందని ప్రశ్నించారు. మకోవైపు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం 26 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తోందన్నారు. కానీ కేసీఆర్‌ వల్ల లక్షల మంది రైతులు నష్టపోయారని కిషన్ రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు.

ఇటీవల వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించకోలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసంమే భద్రాచలం వెళ్లి ఎకరాకు 10 వేలు ఇస్తామన్న ప్రకటించిన కేసీఆర్‌.. ఇంత వరకు వారిని ఆదుకోలేదన్నారు. రాష్‌రంలో అధిక శాతం మంది రైతులు లక్షకు పైనే రుణాలు తీసుకొని వ్యవసాయం చేస్తురన్నారు. మరి కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష లోపు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ చేస్తే.. లక్ష కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని కూడా రాజకీయంగా వాడుకుంటూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌ వ్యవహార శైలిని రైతులు గమనిస్తున్నారన్న కిషన్‌ రెడ్డి.. రైతులు కేసీఆర్‌కు ఏ విధంగా బుద్ది చెప్పాలో అదే విధంగా చెబుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

#brs #kcr #telangana #kishan-reddy #amit-shah #rythu-ghosa-bjp-bharosa #farmers-bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe