Amit Shah: రేపు అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

రేపు తెలంగాణకు రావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటను రద్దు చేసుకున్నారు. బీహార్ రాజకీయ పరిణామాలతో తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

New Update
Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా ఆస్తుల వివరాలు

Amit Shah Telangana Tour  Cancelled: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. రేపు  తెలంగాణలో పర్యటన చేపట్టనున్న అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. బీహార్ రాజకీయ పరిణామాలతో తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి అమిత్ షా రేపు తెలంగాణలో మూడు జిల్లాలో పర్యటన చేపడుతారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అమిత్ షా కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. అమిత్ షా తెలంగాణ పర్యటన కొత్త తేదీలను ప్రకటిస్తామని అమిత్ షా కార్యాలయం తెలిపింది.

బీహార్ బీజేపీ వైపే...

బీహార్‌(Bihar) లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వారం రోజులుగా వస్తున్న గాసిప్స్‌కు ఇవాళ తెరపడనున్నాయి. నితీశ్ కుమార్(Nitish Kumar) మరి కాసేపట్లో రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఇది కాయం అని సంకేతాలిస్తూ నితీశ్ ప్రభుత్వం మరో కీలక నిర్నయాన్ని ప్రకటించింది. బీహార్‌లోని 100మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదీలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలన శాఖ ఈ ఉత్తర్వులను ఇచ్చింది. 

బీహార్‌లో మొత్తం 22మంది ఐఏఎస్, 79మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్ 1 స్థాయి అధికారులను నితీశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో 5గురు జిల్లా కలెక్టర్లు, 17 మంది సూపరెండెంట్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. ఇక పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నియమించారు.

నిన్న, మొన్నటి వరకు ఇండియా కూటమి(Alliance of Indiaతో చెట్టపట్టాలేసుకుని తిరిగి, మీటింగ్‌లకు హాజరయి… కూటమితోనే ఉంటాను అని సంకేతాలిచ్చిన నితీశ్ ఇప్పుడు రంగు మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా ఇవి హల్ చల్ చేస్తున్నా… నిన్నటి నుంచి మరింత ఊపందుకున్నాయి. వస్తున్న వార్తల ప్రకారం నితీశ్ కుమార్ ఎన్డేయే కూటమిలోకి చేరబోతున్నారని… మరోసారి సీఎం అవడం ఖాయమని తెలుస్తోంది. నితీశ్‌ కుమార్‌ కోసం రెండు కూటమిలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఆయనను ఒప్పించేందుకు ఆర్జేడీ-కాంగ్రెస్(RJD-Congress) చేసిన ప్రయత్నాలు ఏవీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఆర్జేడీ(RJD) మాత్రం లొంగిపోయే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపై నితీశ్ ఎన్డీయే(NDA) లోకి రావడం దాదాపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పైపై లాంఛనాలు మాత్రమే చేయాల్సి ఉందని సమాచారం.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు