Amit Shah :రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కింది కాంగ్రెస్సే.. అమిత్ షా సంచలన పోస్ట్!

ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందంటూ కాంగ్రెస్ పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని, కాంగ్రెస్ పార్టీకి కుటుంబం, అధికారం తప్పా మరేదీ ముఖ్యం కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Amit Shah :రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కింది కాంగ్రెస్సే.. అమిత్ షా సంచలన పోస్ట్!
New Update

Delhi: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 5 దశాబ్దాలు పూర్తవుతుందని, ఇప్పటికీ ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని, ఆయన అమ్మమ్మ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించారంటూ ఎద్దేశా చేశారు.

అతని తండ్రి రాజీవ్ గాంధీ 1985, జూలై 23న పార్లమెంట్ సాక్షిగా 'ఎమర్జెన్సీ విధించడం తప్పేమీ కాదని' చెప్పినట్టు రాహుల్ గాంధీ మర్చిపోయారని అన్నారు. 'ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు కాంగ్రెస్ మన రాజ్యాంగ స్పూర్తిని అనేకసార్లు తుంగలో తొక్కింది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ భారత ప్రజలపై క్రూరమైన దౌర్జన్యాలను సృష్టించిందన్నారు. ఇక రాజీవ్ గాంధీ ఆనాడు ఎమర్జెన్సీ అవసరమని భావించి అమలు చేయని పక్షంలో దేశ ప్రధాని ఎవరైనా ఆ పదవిలో ఉండేందుకు తగినవారు కాదన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి కుటుంబం, అధికారం తప్పించి మరేదీ ప్రియమైనది కాదని స్పష్టమవుతోందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

#amit-shah #congress #rahulgandi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe