అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ యుద్దం కొనసాగుతున్న వేళ.. బిన్ లాడెన్‌కు 21 ఏళ్ల కిందట రాసిన లేఖ ఇప్పుడు వెరల్ అవుతోంది. అమెరికాపై ఉగ్రదాడి జరిగిన తర్వాత అమెరికన్లను ఒసామా బిన్ లాడెన్ రాసిన లేఖలో 'పాలస్తీనా ఆక్రమణ గురించి ప్రస్తావించడం' ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఇందుకు సంబంధించి టిక్‌టాక్ యూజర్ లినెట్ అడ్కిన్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న పనిని వారు ఆపాలి. ప్రతిఒక్కరూ దీన్ని చదవడం అవసరమని పేర్కొంది.
Also Read: షాకింగ్ న్యూస్.. ఎయిర్ ఇండియా పైలట్ మృతి.. కారణం ఇదే..
ఇదిలాఉండగా.. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగన ఉగ్ర దాడిని ఒసామా బిన్ లాడెన్ సమర్థించాడు. అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పాల్పడిన అనేక దురాగతాలతో సహా పాలస్తీనాను ఆక్రమించి ఆ దేశ ప్రజలను అణచివేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతివ్వడం గురించి బిన్ లాడెన్ ఈ లేఖలో ప్రస్తావించాడు. పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉందని.. సెప్టెంబర్ 11 వరకు అమెరికా అధ్యక్షులెవరూ కూడా దాని గురించి మాట్లాడలేదని చెప్పాడు. పాలస్తీనా బంధీగా ఉండదని.. దాని సంకెళ్లను తెంచేందుకు మేము ప్రయత్నాలు చేస్తామని.. క్రైస్తవుల రక్తంతో కూడిన దురహంకారానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుందని లేఖలో హెచ్చరికలు జారీ చేశాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: భారత సైన్యంలోకి ట్రాన్స్ జెండర్లు…?