ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియా హస్తముందని...కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపణలు చేశారు. తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు ట్రుడో. వేంటనే భారత దౌత్యాధికారిని
బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలాపీ జోలి ప్రకటించారు.దీనికి బదులుగా భారత ప్రభుత్వం అంతే వేగంగా స్పందించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకోవడే కాక భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కెనడా దౌత్యాధికారిని బహిష్కిస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రోజుల్లోగా అతను దేశం విడిచి వెళ్ళాలని ఆదేశాలను జారీ చేసింది.
ఈ మొత్తం వ్యవహారం మీద అమెరికా స్పందించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన ఆరోపణల మీద తీ్రవ ఆందోళన వ్యక్తం చేసింది. కెనడా భాగస్వామ్య పక్షాలను తాము నిత్యం సంప్రదిస్తూనే ఉన్నామని చెప్పింది. ఇలాంటి ఆరోపణల కంటే నిజ్జర్ హత్య మీద దర్యాప్తు కొనసాగించడం, బాధ్యలకు శిక్షపడేలా చేయడం ముఖ్యమని వ్యాఖ్యానించారు వైట్ హౌస్ కౌన్సిల్ ప్రతినిధి అడ్రియెన్నె వాట్సన్.