ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హరదీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియా హస్తముందని…కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపణలు చేశారు. తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు ట్రుడో. వేంటనే భారత దౌత్యాధికారిని
బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలాపీ జోలి ప్రకటించారు.దీనికి బదులుగా భారత ప్రభుత్వం అంతే వేగంగా స్పందించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకోవడే కాక భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కెనడా దౌత్యాధికారిని బహిష్కిస్తున్నట్టు ప్రకటించింది. ఐదు రోజుల్లోగా అతను దేశం విడిచి వెళ్ళాలని ఆదేశాలను జారీ చేసింది.
కెనడా-భారత్ వ్యాఖ్యల మీద అమెరికా స్పందన
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
Translate this News: