US: వామ్మో ఇదేం గాలిరా బాబు...ఏకంగా విమానాన్నే..! అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు అతలాకుతలం చేశాయి. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్ 737-800 విమానం పార్కింగ్‌లో నిలిపి ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా గిరిగిర తిరిగింది.ఈ వీడియో ఈ కథనంలో.. By Bhavana 29 May 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి US: సాధారణంగా వాయుగుండాలు పడినప్పుడు, తుపాన్ లు బీభత్సం సృష్టించినప్పుడు గాలులు ఎంతటి విధ్వంసాలను సృష్టిస్తాయో మనకు తెలిసిన విషయమే. అలా గాలులు వీస్తున్న సమయంలో వస్తువులు ఎగిరిపోవడం, చెట్లు విరిగిపడిపోవడం లాంటి దృశ్యాలను చూస్తూనే ఉంటాం. కానీ ఈదురు గాలు లు వల్ల ఏకంగా ఓ బోయింగ్ విమానామే గిరగిరా తిరిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు అతలాకుతలం చేశాయి. డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్ 737-800 విమానం పార్కింగ్‌లో నిలిపి ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా గిరిగిర తిరిగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విమానాశ్రయంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. American Airlines 737-800 pushed away from its gate at DFW Airport during severe weather Tuesday morning. pic.twitter.com/HEbHNzOB4Z — Aviation (@webflite) May 28, 2024 మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో గేట్ సీ21 దగ్గర ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ సమయంలో దాదాపు గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు అధికారులు సుమారు 202 విమానాలను రద్దు చేసింది. మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. Also read: తెరుచుకున్న పాఠశాలలు.. ఎండకు సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు #flight #america #texas #us #torando మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి