Israel-Hamas War: హమాస్‌ వల్లే మళ్లీ గాజాలో బాంబులు.. అమెరికా ఆగ్రహం..

ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన అనంతరం మళ్లీ గాజాలో బాంబులు పేలాయి. దీనిపై స్పందించిన అమెరికా.. కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోవడానికి హమాస్ చర్యలే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్‌ ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసిందని ఆరోపించింది.

New Update
Israel-Hamas War: హమాస్‌ వల్లే మళ్లీ గాజాలో బాంబులు.. అమెరికా ఆగ్రహం..

ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య మొన్నటివరకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇజ్రాయెల్, హమాస్‌లు తాము నిర్బంధించిన బంధీలను విడుదల చేశాయి. ఈ ఒప్పందాన్ని మరికొన్ని రోజులు పాటు పొడగించాలని.. దీనివల్ల ఎక్కవ మంది బందీలను విడుదల చేయవచ్చని చాలాదేశాలు అభిప్రాయపడ్డాయి. ఇలా చేయడం వల్లైనా కనీసం ఇజ్రాయెల్-హమాస్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చల్లారిపోతాయని భావించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటిగే వచ్చింది. గాజాలో మళ్లీ బాంబులు పేలుతున్నాయి. అయితే దీనిపై అమెరికా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందం ఆగిపోవడానికి హమాస్ చర్యలే కారణమంటూ ఆరోపించింది. హమాస్‌ ఒప్పందాన్ని గౌరవించకుండా.. ఉల్లంఘనలకు పాల్పడిందని తీవ్రంగా విమర్శించింది.

ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడారు. జెరూసలెంలో జరిగిన దాడిని, సంధి ముగిసిపోక ముందే హమాస్‌ వైపు నుంచి రాకెట్లు దూసుకువచ్చాయని ఆయన తెలిపారు. ఈ విరామం ఎందుకు నిలిచిపోయిందో అందరూ అర్థం చేసుకోవాలన్నారు. హమాస్ జరిపిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని.. పలువురికి గాయాలయ్యాయని అందులో అమెరికన్లు కూడా ఉన్నారని తెలిపారు. అలాగే మిలిటెంట్లు రాకెట్లను పేల్చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలన్నదే అమెరికా ఉద్దేశమని.. ఇరువైపుల నుంచి బందీల విడుదలపైనే మా దృష్టి ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్‌కు, అక్టోబర్ 7 లాంటి ఘటన మళ్లీ జరగకుండా చేసేందుకు హమాస్ చేసే ప్రయత్నాలకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: ఎప్పటికీ మా నాన్నే నా హీరో.. కవిత ట్వీట్ కు అర్థం అదేనా?

ఇదిలాఉండగా.. గత నెల 24న ఇజ్రాయెల్-హమస్ మధ్య గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో.. వారం రోజుల పాటు ఎలాంటి దాడులు కూడా జరగలేవు. ఈ సమయంలో ఇరువైపుల నుంచి బందీలను విడుదల చేశారు. ముందుగా నాలుగు రోజులు మాత్రమే ఈ ఒప్పందం అనుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. అయితే శుక్రవారం ఉదయం నాటికి ఈ ఒప్పందం ముగిసింది. కాల్పుల విరమణను ఇంకా

అక్టోబర్‌ 24న ఇజ్రాయెల్‌-హమాస్‌(Israel-Hamas) మధ్య గాజాలో కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం జరగడంతో వారం రోజుల పాటు దాడులు చోటుచేసుకోలేదు. తొలుత నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అనంతరం బందీల విడుదల కోసం ఈ వ్యవధిని పెంచారు. ఈ గడువు శుక్రవారం ఉదయంతో ముగిసింది. కాల్పుల విరమణను ఇంకా కొన్నిరోజులపాటు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. హమాస్‌ తొలుత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌ వైమానిక, భూతల దాడులకు దిగింది. దీంతో బందీల విడుదల ఆగిపోయింది.

Advertisment
తాజా కథనాలు