హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ ఎదురు దాడులు!

గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతూ ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై అమెరికా, బ్రిటన్ లు దాడులకు తెగబడ్డాయి.

హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ ఎదురు దాడులు!
New Update

Houthis VS UK-US: గాజా పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని కోరుతూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల పై దాడులకు తెగబడుతున్న యెమన్‌ హొతీ మిలిటెంట్ల పై అమెరికా , బ్రిటన్‌ బలగాలు ఎదురు దాడులకు దిగాయి. గురువారం రాత్రి నుంచే అమెరికా , బ్రిటన్‌ సైన్యాలు హోతీ నియంత్రిత ప్రాంతలపై దాడులు ప్రారంభించాయి.

అమెరికా, బ్రిటన్‌ బలగాలతో పాటు..

అమెరికా, బ్రిటన్‌ బలగాలతో పాటు ఆస్ట్రేలియా, బెహ్రయిన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ సైన్యాలు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా వైట్‌ హౌస్‌ తెలిపింది. '' ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవడానికైనా అమెరికా సైన్యం సిద్దంగా ఉందని, వెనుకాడుగు వేసేదే లేదని '' అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఎయిర్‌ స్ట్రైక్‌..

హౌతీ స్థావరాలపై ఇప్పటికే అమెరికా తోమాహాక్‌ క్షిపణులను వినియోగించింది. అంతేకాకుండా గైడెడ్‌ మిస్సైల్‌ సబ్‌ మెరైన్‌ '' యూఎస్‌ఎస్‌ ఫ్లోరిడా'' ను కూడా అమెరికా ఈ దాడుల్లో ఉపయోగించుకుంది. అంతేకాకుండా 12 కు పైగా హోతీ లక్ష్యాలపై ఎయిర్‌ స్ట్రైక్‌ నిర్వహించింది. హోతీలకు సంబంధించి రాడార్‌ సిస్టమ్‌లు, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, బాలిస్టిక్‌ క్షిపణి నిల్వ కేంద్రాలతో పాటు క్రూయిజ్‌ క్షిపణి నిల్వ కేంద్రాల పై కూడా దాడులు జరిపాయి.

చాలా తీవ్రంగా ఉంటుందని..

హౌతీ నాయకుడు అబ్దుల్‌ మాలెక్‌ అల్‌ హోతీ గురువారం ఈ విషయం గురించి ప్రస్తావించారు.'' యెమెన్‌ పై అమెరికా దాడికి ప్రతి సమాధానం కచ్చితంగా చెప్పి తీరుతామన్నారు. సముద్రంలో మొహరించిన అమెరికా నౌకల పై దాడి చేయడం కంటే కూడా మేము చేసే ప్రతి స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

'' పాలస్తీనాకు యెమెన్‌ పొరుగు దేశం కాదు కదా..! పాలస్తీనాలోని గాజా లో ఉన్న హమాస్‌ మిలిటెంట్స్‌ కు మీరు ఎందుకు సహకరిసత్ఉన్నారు ? అని హౌతీ నేత అల్‌ హౌతీని ప్రశ్నించగా.. ఆయన చాలా సీరియస్‌ గా వార్నింగ్‌ ఇచ్చారు. తాము పాలస్తీనాకు బహిరంగంగా ఎప్పుడూ మద్దతు తెలపలేదని చెప్పారు. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంలో తమ ప్రమేయాన్ని అల్ హౌతీ సమర్థించుకున్నారు.

రెండు రోజుల నుంచి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్నారు. ఆయన యెమన్ హౌతీల అంశంపై మిడిల్ ఈస్ట్ దేశాల నాయకులందరితో చర్చించారు. అయినా పాలస్తీనియన్లు వాళ్లు చేయాల్సింది చేస్తారన్నారు.తాము హౌతీలపై చేయనున్న దాడిని అంతర్జాతీయ సమాజానికి ప్రయోజనం కోణంలోనే చూడాలని వారికి బ్లింకెన్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Also read: పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..వెంటనే కొనేయండి మరీ!

#britan #uk #us #houthis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe