Ambati Rayudu: అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం ఇదే..!

పవన్ కల్యాణ్‌తో భేటీపై సోషల్ మీడియాలో స్పందించారు అంబటి రాయుడు. పాలిటిక్స్ ను వదిలేద్దామనుకున్నా..కానీ ఫ్రెండ్స్ సలహా ద్వారా పవన్ ను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగానే వైసీపీ సిద్ధాంతాలు నచ్చకే పార్టీకి రాజీనామ చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Ambati Rayudu: అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడానికి అసలు కారణం ఇదే..!
New Update

Ambati Rayudu: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌( Pawan Kalyan)తో పార్టీ కార్యాలయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) భేటీ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 28న అధికార పార్టీ వైసీపీలో చేరిన ఆయన సరిగ్గా పార్టీలో జాయిన్ అయిన పది రోజుల్లోనే పార్టీని వీడుతున్నట్టు తెలిపాడు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే అంబటి రాజీనామా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో భేటీ కీలకంగా మారింది. తాజాగా, ఈ భేటీపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.

ట్వీట్ లో ఎమన్నారంటే?

"స్వచ్ఛమైన సంకల్పంతో, హృదయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. నేను ysrcp లో చేరాను.. నా దృష్టిని నెరవేర్చుకోగలనని నేను నమ్మాను. నేను మైదానంలో ఉంటూ అనేక గ్రామాలను సందర్శించి చాలా మంది ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. వ్యక్తిగతంగా వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేశాను. చాలా సామాజిక సేవ చేశాను.

సిద్ధాంతాలు నచ్చలేదు: అంబటి

అయితే, కొన్ని కారణాల వల్ల ysrcpతో నా కల నెరవేరుతుందని అనిపించలేదు. పార్టీపై ఎలాంటి నిందలు లేవు. నా ఐడియాలజీ, ysrcp ఐడియాలజీ ఏకీభవించలేదు. ఎన్నికల్లో ఇక్కడ నుండే పోటీ చేస్తాను అను ఖచ్చితంగా ఏమీ లేదు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే రాజీనామా చేశాను.



Also Read:ఏపీ ప్రజలకు రిలీఫ్.. రేపటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు

ప్రజలకు అండగా ఉంటాను

కానీ, నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు జనసేన అధినేత పవన్ అన్న సిద్ధాంతాలను చెప్పడంతో వారిని కలవాలని అనుకున్నాను. నేను పవన్ అన్నను కలిశాను. ఆయనతో జీవితం గురించి రాజకీయాల గురించి చర్చించడం..వాటిని అర్థం చేసుకోవడం కోసం చాలా సమయం గడిపాను. అతని భావజాలం, దృక్పథం నాకు ఉన్నాయని చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతనిని కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా క్రికెట్ కమిట్‌మెంట్‌ల కోసం నేను దుబాయ్‌కి బయలుదేరాను. నేను ఎప్పుడూ అండగా ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటాను". అని పోస్ట్ చేశారు.

#andhra-pradesh #janasena #pawan-kalyan #ycp #ambati-rayudu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe