పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగా వర్థంతి కార్యక్రమంలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రంగాని ఆనాటి టీడీపీ ప్రభుత్వమే చంపేసిందని ఆయన ఆరోపించారు. దాని ప్రతిఫలమే ఆనాడు ప్రభుత్వం మారడమని ఆయన అన్నారు.
ఆ తరువాత మళ్లీ పరిస్థితులు తారుమారు కావడం వల్ల ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని వివరించారు. గతంలో తనతో పాటు ఉన్నా ఓ నేత ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేత అప్పట్లో రంగాను చంపింది టీడీపీయేనని, చంపింది చంద్రబాబేనని డైరెక్ట్ గా చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా అతనిని కూడా చంపాలని చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు.
ఆరోజు రంగాని చంపగలిగాన వాడు కానీ నన్ను చంపలేకపోయాడని ఆ నేత చెప్పాడు. కానీ నేటి రాజకీయాల్లో ఏం జరుగుతోంది పదవే శాశ్వతమా? పదవి కోసం పాకులాడడమే ముఖ్యమా? పదవి కోసం పాకులాడేవాడ్ని సమాజం ఎప్పటికీ క్షమించదని అంబటి అన్నారు.
నేను గతంలో కాంగ్రెస్ లో ఉన్నాను.
వైఎస్ చనిపోగానే జగన్ వెంట నడిచాను. పదవి కోసమే నడిచానా? ఆ రోజు జగన్ సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా? నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం, మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి... అది వేరే విషయం" అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Also read: పవర్ స్టార్ పోటీ అక్కడి నుంచే.. కాపు సంక్షేమ సేన నేత సంచలన ప్రకటన!