Ambani Wedding: పెళ్ళిలో అనంత్ - రాధికా క్యూట్ డాన్స్.. వీడియో వైరల్..!

అనంత్- రాధికా వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్ళిలో అనంత్- రాధికా దండలు మార్చుకున్న తర్వాత ఒకరి చేతులు మరొకరు పట్టుకుని డ్యాన్స్ వేశారు. ఈ క్యూట్ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

New Update
Ambani Wedding: పెళ్ళిలో అనంత్ - రాధికా క్యూట్ డాన్స్.. వీడియో వైరల్..!

Anant Weds Radhika:  జులై 12 శుక్రవారం రాత్రి 9.30 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల వివాహం (Anant - Radhika) అంగరంగ వైభవంగా జరిగింది. అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ వివాహ మహోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, దేశాధినేతలు హాజరయ్యారు.

పెళ్ళిలో అనంత్- రాధికా డాన్స్ వీడియో

తాజాగా అనంత్- రాధికా వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివాహ వేడుకలో అనంత్- రాధికా దండలు మార్చుకున్న తర్వాత ఒకరి చేతులు మరొకరు పట్టుకుని డ్యాన్స్ వేశారు. అనంత్ తన భార్య రాధిక నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. అనంత్ -రాధికా తమ కోసం స్పెషల్ గా చేసిన పాటకు క్యూట్ గా డాన్స్ వేశారు.  ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆ తర్వాత అనంత్ - రాధికా మర్చంట్ పెవిలియన్‌లో అందరి ముందు ఒకరికొకరు ప్రత్యేక వాగ్దానాలు చేసుకున్నారు. రాధికా తన ఇల్లు సురక్షితమైన ప్రదేశంగా ఉంటుందని, ప్రేమ, కలయికతో నిండి ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో, అనంత్ తన భార్య రాధికతో కలిసి తన కలల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చాడు.ఈ జంట వివాహంలో, అతిథులందరూ సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. అనంత్-రాధికల పెళ్లిలో షారుక్ ఖాన్, మాధురీ దీక్షిత్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, షారుక్ ఖాన్, మహేష్ బాబు, యష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, కృతి సనన్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్, అలియా భట్. రణబీర్ కపూర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే పలువురు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.

Also Read: Nita Ambani: అనంత్ పెళ్ళిలో నీతా అంబానీ స్పెషల్ మెహందీ డిజైన్.. వీడియో వైరల్ - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు