Nita Ambani: అనంత్ పెళ్ళిలో నీతా అంబానీ స్పెషల్ మెహందీ డిజైన్.. ప్రత్యేకతేంటో తెలుసా..?

అనంత్ అంబానీ-రాధికా పెళ్లి వేడుకల్లో నీతా అంబానీ మెహందీ డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీతా అంబానీ తన మెహందీ డిజైన్ లో రాధా-కృష్ణల ఫోటోతో పాటు అంబానీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు.

New Update
Nita Ambani: అనంత్ పెళ్ళిలో నీతా అంబానీ స్పెషల్ మెహందీ డిజైన్.. ప్రత్యేకతేంటో తెలుసా..?

Nita Ambani Mehandi: రిలయన్స్ అధినేత ముఖేష్-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జులై 12న అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అయితే అనంత్ అంబానీ మెహందీ వేడుకల్లో నీతా అంబానీ మెహందీ డిజైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

నీతా అంబానీ మెహందీ డిజైన్ లో ఫ్యామిలీ పేర్లు

publive-image

నీతా అంబానీ తన మెహందీ డిజైన్ లో రాధా-కృష్ణల ఫోటోతో పాటు అంబానీ కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు. ఇలా మెహందీలో ప్రియమైన వ్యక్తుల పేర్లను రాసే సంప్రదాయం భారతదేశంలో శతాబ్దాల నాటిది. మెహందీ అనేది ఆనందం, అందం, శుభ ప్రారంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు నీతా అంబానీ కూడా తన కుమారుడి పెళ్ళిలో ఇదే సంప్రదాయాన్ని రిపీట్ చేశారు. తన మెహందీ డిజైన్ లో కుటుంబ సభ్యులందరి పేర్లను రాయించుకున్నారు. ఇది కుటుంబం ఐక్యత, సామూహిక శక్తిని చూపించింది. అదే సమయంలో ఆమె చేతి పై ఉన్న రాధా-కృష్ణుల బొమ్మ దైవిక ప్రేమను ప్రతిభింబించింది. అనంత్-రాధిక, కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా అంబానీ , అల్లుడు ఆనంద్ పిరమల్, భర్త ముఖేష్ అంబానీ, మనవళ్లు పృథ్వీ, వేద్, కృష్ణ, ఆదియా పేర్లను నీతా అంబానీ తన మెహందీ డిజైన్ అందంగా రాశారు.

Also Read: Alia Saree Look: అంబానీ పెళ్ళి వేడుకల్లో 160 ఏళ్ల నాటి చీరలో మెరిసిన ఆలియా.. లుక్ వైరల్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు