Mahesh Babu : బెంగళూరులో బ్రాంచ్‌ ఓపెన్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఏషియన్‌ సంస్థతో కలిసి ఇదే ఏఎంబీ పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీని గురించి ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Mahesh Babu : బెంగళూరులో బ్రాంచ్‌ ఓపెన్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌!
New Update

Tollywood : టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు(Mahesh Babu) ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే ఆయన హైదరాబాద్(Hyderabad) లో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్‌(AMB Cinemas) అనే ఓ మల్టీప్లెక్స్ ని నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా కూడా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు.

ఒకప్పుడు కేవలం తాను చేస్తున్న సినిమాల్లోనే కొన్నాళ్లు నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతూ వచ్చినప్పటికీ ఆయన తాజాగా ఇతర హీరోలను కూడా పెట్టి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆ సంగతి అంతా పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్ లో ఏషియన్‌ మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ అనగానే ఓ ల్యాండ్‌ మార్క్‌ గా మారిపోయింది.

శరత్ సిటీ క్యాపిటల్‌ మాల్‌ లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లో ఓ పాపులర్ విసిటింగ్‌ ప్లేస్ గా కూడా మారిపోయింది అని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలోనే మహేష్‌ బాబు తన బిజినెస్‌ ని ఇంకా వ్యాపించేందుకు చూస్తున్నాడు. మరోసారి ఏషియన్‌ సంస్థతో కలిసి ఇదే ఏఎంబీ పేరుతో బెంగళూరు(Bangalore) లో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు.

దీని గురించి ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పూజా కార్యక్రమాలలో ఏషియన్ సంస్థ చీఫ్ సునీల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంత మంది పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు కానీ మహేష్ బాబు టీమ్ గాని ఎవరు హాజరైనట్లుగా కనిపించడం లేదు.

Also read: నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

#bangalore #mahesh-babu #amb-cinemas #asian-cinemas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి