Ayodhya Ram Mandir : ఆన్‌లైన్‌లో ఫేక్ అయోధ్య రామాలయ ప్రసాదాలు.. అమెజాన్‌కు నోటీసులు..

నకిలీ అయోధ్య రామాలయ ప్రసాదాలు అమ్మకాలు పెట్టారనే ఆరపోణలతో కేంద్రం అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెల్లర్లపై చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై పాలసీ ప్రాకారం ముందుకెళ్తామని అమెజాన్‌ స్పందించింది.

New Update
Ayodhya Ram Mandir : ఆన్‌లైన్‌లో ఫేక్ అయోధ్య రామాలయ ప్రసాదాలు.. అమెజాన్‌కు నోటీసులు..

Ayodhya : అయోధ్య(Ayodhya) లో రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ఆన్‌లైన్‌ నకిలీ ఉత్పత్తులు కనిపిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌(Amazon) లో నకిలీ ప్రసాదాలు(Duplicate Prasad) అమ్మకాలు పెట్టారన్న ఆరోపణలతో.. కేంద్ర ప్రభుత్వం.. ఈ-కామర్స్(E-Commerce) దిగ్గజ సంస్థ అమెజాన్‌ సంస్థకు నోటీసులు పంపింది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది. దీంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) రంగంలోకి దిగింది. అమెజాన్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

Also Read: రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!

శ్రీ రామ మందిర్(Sri Ram Mandir) అయోధ్య ప్రసాదం, అయోధ్య రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం, రామ మందిర్‌ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్‌ పేడ, ఖోయా ఖోబీ లడ్డూ, రఘుపతి నెయ్యి లడ్డూ అమెజాన్‌లో అమ్ముతున్నట్లు సమాచారం. అయితే వీళ్లు సాధారణంగా ఉండే మిఠాయిలనే.. అయోధ్య రామమందిర ప్రసాదంగా ఆన్‌లైన్‌(Online) లో అమ్మతున్నట్లు సీఏఐటీ ఫిర్యాదులో తెలిపింది. తప్పుడు ప్రకటనలు చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించింది.

అమెజాన్‌కు నోటీసులు వెళ్లిన నేపథ్యంలో వారం లోపు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సీసీపీఓ ఆదేశించింది. లేనిపక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 ప్రకారం చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. అయితే దీనిపై అమెజాన్ స్పందించింది. సెల్లర్ల జాబితాను పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై తమ పాలసీ ప్రకారం ముందుకెళ్తామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.

Also Read: అయోధ్యలో విపత్తుల చిరు ఆసుపత్రి భీష్మ్..

Advertisment
తాజా కథనాలు