Amarnath Yatra Devotees : గత నెల జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) కు భక్తులు పోటేత్తుతున్నారు. రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని (Himalayas) మంచు శివలింగం దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దక్షిణ కాశ్మీర్ (South Kashmir) లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత అమర్‌నాథ్ గుహలో కొలువైన మంచు శివ లింగాన్ని సందర్శించే వారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోల్చితే ఈసారి యాత్రికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
యాత్ర ప్రారంభం అయిన 15 రోజుల్లో మూడు లక్షల మంది యాత్రికుల కంటే ఎక్కువ మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు.అమర్‌నాథ్ యాత్ర గత నెల 29 వ తేదీన ప్రారంభం కాగా.. ఈ నెల 13 వ తేదీ వరకు కేవలం 15 రోజుల్లోనే రికార్డు స్థాయిలో మంది మూడు లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.
Also Read : గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు