సంచలన ఆరోపణ
నందమూరి బాలకృష్ణపై మంత్రి కారుమూరి నాగేశ్వరావు సంచలన ఆరోపణ చేశారు. బాలకృష్ణ అంత సమర్ధుడైతే.. తండ్రికి వెన్నుపోటు పొడిచినప్పుడు పార్టీని తీసుకుని ముందుకు నడిపేవాడన్నారు. బాలకృష్ణకి మాట్లాడడమే సరిగా రాదు.. ఇక పార్టీని ఎలా నడుపుతాడని ఎద్దేవా చేశాడు. బాలయ్యకు బుర్రలేదు.. లోకేష్ ముద్దపప్పు అంటూ ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చురకలు అంటించారు. టీడీపీని బాలకృష్ణ, యనమల కబ్జా చెయ్యాలని చూస్తున్నారని ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడుతున్న బాలకృష్ణ.. నీ తండ్రికి జరిగిన అవమానం గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. టీడీపీ మునిగిపోయిన నావా..? బాలకృష్ణ వచ్చిన, ఇంకెవరు వచ్చిన ఏం చేయలేరన్నారు. నారా లోకేష్ సొల్లు వాగడం తప్ప... చేతల్లో ఏం ఉండదన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు, పాదయాత్ర చేసిన రోడ్‌షోలు చేసిన ఎవరూ పట్టించుకోరుకుంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. టీడీపీని కబ్జా చేసేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారని చురకలు అంటించటంతో ఏపీలో మరో రచ్చ మొదలైంది.
ఒకరిపై ఒకరు పోటీ
అమరావతిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీ పగ్గాలు కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. లోకేశ్ అసమర్థుడు కనుక బాలకృష్ణ, యనమల రివ్యూలు చేస్తున్నారని అన్నారు. టీడీపీని యనమల, బాలకృష్ణ కబ్జా చేసేందుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అధికారంలోకి వస్తాం అనటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉండగా దోచుకోడం తప్ప.. లోకేష్ ఇంకేమి చెయ్యలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రెండెకరాల నుంచి 3 లక్షల కోట్ల ఆస్తులు పోగెట్టారు. చంద్రబాబు బ్రతుకు అంతా స్కాంల మయం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో లోకేష్ గురించి పవన్ చెప్పినవి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. లోకేష్ అవినీతి గురించి పవన్ ఆనాడే చెప్పాడు.. ఆనాడు పవన్ కుటుంబాన్ని భూతులు తిట్టించి నేడు అన్న అంటున్నాడని పవన్ మండిపడ్డారు.
కక్ష సాధింపు అని కవర్
పవన్ ప్యాకేజ్ స్టార్ట్ అని మరో సారి రుజువు అయ్యింది మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు చేశారు. బాలకృష్ణకు బుర్ర లేదు.. బుర్ర ఉంటే టీడీపీని ఆయనే తీసుకునేవాడని వ్యాఖ్యానించారు. దొంగని పట్టుకుంటే వీళ్లంతా యెందుకు మోరుగుతున్నారో అర్థం కావటం లేదన్నారు. స్కిల్ స్కాం జరగలేదని ఎవరూ చెప్పడం లేదు.. కక్ష సాధింపు అని కవర్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రముఖ లాయర్లు వచ్చినా..? స్కాం గురించి మాట్లాడటం లేదన్నారు. టెక్నికల్ ఇష్యూస్ చూపించి తప్పించుకోవాలని చూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతలపై మండిపడ్డారు.